Bandi Sanjay: ఈనెల 10 నుండి బండి సంజయ్ యాత్ర
Bandi Sanjay: ఎన్నికల వరకు ప్రజాహిత పేరుతో కొనసాగనున్న యాత్ర
Bandi Sanjay: ఈనెల 10 నుండి బండి సంజయ్ యాత్ర
Bandi Sanjay: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎన్నికలపై ఫోకస్ పెంచారు. రానున్న లోక్‌సభ ఎలక్షన్‌కు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 10 నుండి బండి సంజయ్ యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రజాహిత యాత్ర పేరుతో జరగనున్న ఈ యాత్ర ఎన్నికల వరకు కొనసాగించాలని నిర్ణయించారు బండి సంజయ్. కొండగట్టులో పూజల అనంతరం మేడిపల్లి నుండి యాత్ర ప్రారంభం కానుంది. తొలి విడతగా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో 119 కిలోమీటర్ల మేరకు యాత్ర జరగనుంది. దీంతో రూట్ మ్యాప్ ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి బీజేపీ శ్రేణులు.