Yadadari Temple: తడి బట్టలతో దేవుడి సాక్షిగా బండి సంజయ్ ప్రమాణం.. ఏమన్నారంటే?
Yadadari Temple: బీజేపీ చీఫ్ బండి సంజయ్ యాదాద్రికి చేరుకున్నారు.
Yadadari Temple: తడి బట్టలతో దేవుడి సాక్షిగా బండి సంజయ్ ప్రమాణం.. ఏమన్నారంటే?
Yadadari Temple: బీజేపీ చీఫ్ బండి సంజయ్ యాదాద్రికి చేరుకున్నారు. ముందుగా చెప్పినట్లుగా కొద్దిసేపటి క్రితం యాదాద్రి కి చేరుకున్న ఆయన.. తడిబట్టలతో గుడి మెట్లు ఎక్కి స్వామివారి దర్శనానికి వెళ్లారు. తడిబట్టలతో దేవాలయంలోకి వెళ్లి దేవుడి ఎదుట ప్రమాణం చేశారు. అర్చకుల వద్ద బండి సంజయ్ ప్రమాణం చేస్తూ.. నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి, తనకు గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. ఫామ్‌హౌజ్ డీల్ తమది కాదని చెప్పేందుకే ప్రమాణం చేసినట్టు బండి సంజయ్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కూడా ఇదే విధంగా ప్రమాణం చేయాలని కోరారు.