Bandi Sanjay: రాష్ట్రంలో అధికారం లేక కేసీఆర్​ కుటుంబం బతకలేకపోతోంది

Bandi Sanjay: రాష్ట్రంలో అధికారం లేక కేసీఆర్​కుటుంబం బతకలేకపోతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్​ ఆరోపించారు.

Update: 2024-04-06 12:30 GMT

Bandi Sanjay: రాష్ట్రంలో అధికారం లేక కేసీఆర్​ కుటుంబం బతకలేకపోతోంది

Bandi Sanjay: రాష్ట్రంలో అధికారం లేక కేసీఆర్​కుటుంబం బతకలేకపోతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్​ ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎందుకు పొలంబాట పట్టలేదని, నాడు బీఆర్ఎస్​ పాలనలోనే రైతులకు బేడీలు వేశారని సంజయ్ ​వ్యాఖ్యానించారు. గతంలో వర్షాలకు రైతులు నష్టపోతే 10 వేలు ఇస్తానన్న కేసీఆర్‌ ఎందుకు ఇవ్వలేదని, కనీసం ఒక్క రైతు కుటుంబాన్ని అయినా ఆదుకున్నారా అని ప్రశ్నించారు. నయీం ఆస్తులపై విచారణ జరపడంతో పాటు ఆస్తులను దోచుకున్న కేసీఆర్ కుటుంబంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు అవగాహనతో వెళుతున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ అవినీతిపై రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకోదని, కాళేశ్వరం అక్రమాలపై కేసీఆర్ కుటుంబంపై కేసులు పెట్టదని ఆక్షేపించారు.

Tags:    

Similar News