Balmuri Venkat: గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బల్మూర్ వెంకట్
Balmuri Venkat: దేశ స్వాతంత్ర్య సమరంలో పోరాటం చేసి, అహింసా సిద్ధాంతంలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మా గాంధీపై టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ భరత్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి.
Balmuri Venkat: గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బల్మూర్ వెంకట్
Balmuri Venkat: దేశ స్వాతంత్ర్య సమరంలో పోరాటం చేసి, అహింసా సిద్ధాంతంలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మా గాంధీపై టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ భరత్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. అక్టోబర్ 2, గాంధీ జయంతి సందర్భంగా, శ్రీకాంత్ “గాంధీ మహాత్ముడా? జాతిపితనా?” అని అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యల వీడియోలను ఆయన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు శ్రీకాంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తదుపరి చర్యగా, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ శ్రీకాంత్ భరత్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు నమోదు చేయబడింది.