Balapur Laddu 2025: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ – ఈసారి 35 లక్షలు!
Balapur Laddu 2025: హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బాలాపూర్ లడ్డూ ఈసారి మరోసారి రికార్డు ధర పలికింది. కర్మాన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ రూ. 35 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.
Balapur Laddu 2025: హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బాలాపూర్ లడ్డూ ఈసారి మరోసారి రికార్డు ధర పలికింది. కర్మాన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ రూ. 35 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది కంటే దాదాపు రూ. 5 లక్షలు ఎక్కువగా ధర పలకడం విశేషం.
వేలం రూ. 1,116 నుంచి ప్రారంభమైంది. ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో 38 మంది పాల్గొన్నారు. వీరిలో 31 మంది గతంలో కూడా వేలంలో పాల్గొన్నవారే కాగా, కొత్తగా ఏడుగురు లడ్డూ బిడ్డింగ్‌లో అడుగుపెట్టారు. చివరికి లింగాల దశరథ్ గౌడ్ లడ్డూను గెలుచుకుని బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీకి మొత్తం డబ్బును అందజేశారు.
గతేడాది కొలను శంకర్ రెడ్డి రూ. 30,01,000 చెల్లించి లడ్డూను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదితో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం 31 ఏళ్లు పూర్తి చేసుకుంది.
1994లో తొలిసారిగా ఈ వేలం నిర్వహించగా, అప్పట్లో కొలను మోహన్ రెడ్డి కేవలం రూ. 450కే లడ్డూను సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ లడ్డూ ధరలు ఎగబాకుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి.
లడ్డూ దక్కించుకున్న లింగాల దశరథ్ గౌడ్ మాట్లాడుతూ – “గత ఆరేళ్లుగా నేను ఈ వేలంలో పాల్గొంటున్నాను. ఈసారి లడ్డూ దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది గణపయ్య దయ వల్లే సాధ్యమైంది” అని తెలిపారు.
బాలాపూర్ లడ్డూ వేలం ధరల చరిత్ర
| సంవత్సరం | ఎవరు గెలుచుకున్నారు | ధర (రూ.) |
|---|---|---|
| 1994 | కొలను మోహన్ రెడ్డి | 450 |
| 1995 | కొలను మోహన్ రెడ్డి | 4,500 |
| 1996 | కొలను కృష్ణారెడ్డి | 18,000 |
| 1997 | కొలను కృష్ణారెడ్డి | 28,000 |
| 1998 | కొలను మోహన్ రెడ్డి | 51,000 |
| 1999 | కల్లెం అంజి రెడ్డి | 65,000 |
| 2000 | కల్లెం ప్రతాప్ రెడ్డి | 66,000 |
| 2001 | రఘునందన్ చారి | 85,000 |
| 2002 | కందాడ మాధవరెడ్డి | 1,05,000 |
| 2003 | చిగిరింత బాల్‌రెడ్డి | 1,55,000 |
| 2004 | కొలను మోహన్ రెడ్డి | 2,01,000 |
| 2005 | ఇబ్రహీం శేఖర్ | 2,80,000 |
| 2006 | చిగిరింత తిరుపతి రెడ్డి | 3,00,000 |
| 2007 | రఘునందన్ చారి | 4,15,000 |
| 2008 | కొలను మోహన్ రెడ్డి | 5,07,000 |
| 2009 | సరిత | 5,10,000 |
| 2010 | కొడాలి శ్రీధర్ బాబు | 5,35,000 |
| 2011 | కొలను బ్రదర్స్ | 5,45,000 |
| 2012 | పన్నాల గోవర్థన్ రెడ్డి | 7,50,000 |
| 2013 | తీగల కృష్ణారెడ్డి | 9,26,000 |
| 2014 | సింగిరెడ్డి జైహింద్ రెడ్డి | 9,50,000 |
| 2015 | కొలను మదన్ మోహన్ రెడ్డి | 10,32,000 |
| 2016 | స్కైలాబ్ రెడ్డి | 14,65,000 |
| 2017 | నాగం తిరుపతి రెడ్డి | 15,60,000 |
| 2018 | శ్రీనివాస్ గుప్తా | 16,60,000 |
| 2019 | కొలను రామిరెడ్డి | 17,60,000 |
| 2020 | కరోనా కారణంగా అప్పటి సీఎం కేసీఆర్‌కి అందజేశారు | - |
| 2021 | రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి | 18,90,000 |
| 2022 | వంగేటి లక్ష్మారెడ్డి | 24,60,000 |
| 2023 | దాసరి దయానంద్ రెడ్డి | 27,00,000 |
| 2024 | కొలను శంకర్ రెడ్డి | 30,01,000 |
| 2025 | లింగాల దశరథ్ గౌడ్ | 35,00,000 |