మంత్రి కేటీఆర్‌తో ఆస్ట్రేలియా ఇండియా ఇనిస్టిట్యూట్ సీఈఓ లిసా సింగ్ భేటీ

Telangana: వ్యాపార వాణిజ్య వర్గాల సంబంధాల బలోపేతం చర్చ

Update: 2022-04-15 01:01 GMT

మంత్రి కేటీఆర్‌తో ఆస్ట్రేలియా ఇండియా ఇనిస్టిట్యూట్ సీఈఓ లిసా సింగ్ భేటీ

Telangana: ప్రగతి భవన్ లో ఆస్ట్రేలియా ఇండియా ఇనిస్టిట్యూట్ సీఈఓ లిసా సింగ్ కేటీఆర్ తో సమావేశం అయ్యారు. తెలంగాణ , ఆస్ట్రేలియా లోని వ్యాపార వాణిజ్య వర్గాల సంబంధాలను బలోపేతం పైన ఇరువురు చర్చించారు. భారతదేశంలో అత్యంత వేగంగా వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటని తెలంగాణతో ఆస్ట్రేలియాలో ఉన్న వివిధ రంగాలతో వాణిజ్య సంబంధాల బలోపేతానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా ఐటి, లైఫ్ సైన్సెస్, రెన్యువల్ ఎనర్జీ వంటి రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని, వీటిలో ఆస్ట్రేలియా లో ఉన్న పలు కంపెనీలు తెలంగాణ లోని పెట్టుబడుల పైన ఆశావహంగా ఉన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ కి ఆమె తెలిపారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య వ్యాపార వాణిజ్య లకు సంబంధించి అనేక నూతన ఒప్పందాలపై చర్చ నడుస్తున్న సందర్భంగా, త్వరలోనే ఒక ప్రతినిధి బృందం ఇక్కడి పెట్టుబడి అవకాశాలపై పరిశీలన చేసేందుకు భారతదేశంలో పర్యటించనున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు లిసా సింగ్ తెలిపారు.

Tags:    

Similar News