Telangana: మరో ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు

Telangana: వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లు సహా మిగిలిన మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం

Update: 2021-03-31 06:09 GMT

తెలంగాణ ఏస్ఈసీ (ఫైల్ ఫోటో)

Telangana: తెలంగాణలో మరో ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది..ఏప్రిల్ లేదా మే మాసం లో ఎన్నికల నిర్వహించనున్నారు.. వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లు సహా మిగిలిన నాలు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ లోకల్ బాడీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం అవ్వడం తో ప్రచారాల పై దృష్టి పెడుతున్నారు నేతలు.

ఏప్రిల్ మొదటి వారంలో తెలంగాణలోని 4 మున్సిపాలిటీ లు, రెండు కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, సిద్దిపేట మున్సిపాలిటీలతో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు తలపడనున్నాయి.

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దెబ్బతిన్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుతో జోష్ లో ఉంది. వరంగల్, ఖమ్మంలోని రాజకీయ పరిణామాలను సీఎం కేసీఆర్ గమనిస్తున్నారు. మరోవైపు ఎన్నికలకు ముందే వరంగల్, ఖమ్మంలో కేసీఆర్ పర్యటించి వరాలు కురిపిస్తారని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది.

మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించిన టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని స్థానిక టీఆర్ ఎస్ నాయకులను ఆదేశించారు. గతంలో వరంగల్, ఖమ్మంల్లో బీజేపీకి పెద్దగా బలం లేదు. ఈ రెండు నగరాల్లోని టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష నాయకులు బీజేపీలో చేరాలనే చూస్తున్నారనే ప్రచారంతో కేటీఆర్ అలర్ట్ అయ్యారు. ఏప్రిల్ 2 న ఖమ్మం , వరంగల్ లో పర్యటించి స్థానిక రాజకీయ పరిస్థితులు తెలుసుకోనున్నారు. టీఆర్ ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమితో కాస్త నిరాశలో ఉన్న బీజేపీ 4 మున్సిపాలిటీ లు, రెండు కార్పొరేషన్ల ఎన్నికల్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. బీజేపీలో రావాలని చూస్తున్న వివిధ పార్టీల నాయకులను చేర్చుకుని అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు వ్యూహం పన్నుతోంది. ఇప్పటికే బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంలో కమలనాథులు నిమగ్నమయ్యారు. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పాట్లు పడుతోంది. ఏప్రిల్ లో జరిగే మినీ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మరోసారి హోరాహోరీగా తలపడడం ఖాయమనిపిస్తోంది.

Tags:    

Similar News