Pawan Kalyan: కొండగట్టు అంజన్న సేవలో పవన్ కళ్యాణ్
Pawan Kalyan: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Pawan Kalyan: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కేటాయించిన రూ. 35.19 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
వీటిలో: భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల. స్వామివారి దీక్షాపరుల కోసం దీక్ష విరమణ మండపం.
భూమిపూజ అనంతరం నాచుపల్లి శివారులోని ఒక రిసార్ట్‌లో జనసేన పార్టీ కార్యకర్తలతో పవన్ సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారితో చర్చించే అవకాశం ఉంది.
ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ మొదటిసారి కొండగట్టుకు రావడంతో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం పవన్ కల్యాణ్ తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.