BJP: బీజేపీ ఎన్నికల కమిటీల ప్రకటన.. 14 కమిటీలు.. రాజగోపాల్‌రెడ్డి, వివేక్, బండి సంజయ్, విజయశాంతిలకు చోటు
BJP: స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
BJP: బీజేపీ ఎన్నికల కమిటీల ప్రకటన.. 14 కమిటీలు.. రాజగోపాల్‌రెడ్డి, వివేక్, బండి సంజయ్, విజయశాంతిలకు చోటు
BJP: తెలంగాణలో అధికారమే టార్గెట్‌గా బీజేపీ ఎన్నికల కమిటీలను ప్రకటించింది. మొత్తం 14 ఎన్నికల కమిటీలను ప్రకటిస్తూ.. ఛైర్మన్లు, కన్వీనర్లను నియమించింది తెలంగాణ బీజేపీ. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామిని, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా రాజగోపాల్ రెడ్డిని ప్రకటించింది. పబ్లిక్ మీటింగ్ చైర్మన్‌గా బండి సంజయ్, నిరసనల కమిటీ చైర్ పర్సన్‌గా విజయశాంతిని ప్రకటించింది. సోషల్ మీడియా కమిటీ చైర్మన్‌గా ఎంపీ అర్వింద్, ఛార్జ్ షీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్ రావును అనౌన్స్ చేసింది. మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా మహేష్ రెడ్డిని ప్రకటించింది.