రేపు హైదరాబాద్‌కు అమిత్ షా

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన షెడ్యూల్ ఖారారు అయ్యింది.

Update: 2022-05-13 15:00 GMT

రేపు హైదరాబాద్‌కు అమిత్ షా

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన షెడ్యూల్ ఖారారు అయ్యింది. రేపు హైదరాబాద్‌కు అమిత్ షా రానున్నారు. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు అమిత్‌షా రానున్నారు. అక్కడి నుంచి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ వద్దకు వెళ్లి సందర్శించనున్నారు. 4.30 గంటల వరకు అక్కడే ఉండనున్న హోంమంత్రి 5గంటలకు నోవాటెల్ హోటల్‌ లో కాసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. ఇక 6.30 గంటలకు తుక్కుగూడా సభాస్థలికి అమిత్ షా రానున్నారు. సభ ముగిసిన అనంతరం 8 గంటలకు సభ నుంచి నేరుగా అమిత్‌షా ఎయిర్ పోర్టుకి వెళ్లిపోతారు. 8.25కి తిరిగి ఢిల్లీకి ప్రయాణం కానున్నారు అమిత్ షా.

Tags:    

Similar News