Akhilesh Yadav: తెలంగాణలో బీజేపీని తరిమేయండి, మేం కూడా అదే చేస్తాం
Akhilesh Yadav: యూపీలోనూ బీజేపీ అడ్రస్ లేకుండా చేస్తాం
Akhilesh Yadav: తెలంగాణలో బీజేపీని తరిమేయండి, మేం కూడా అదే చేస్తాం
Akhilesh Yadav: బీఆర్ఎస్ సభకు తరలివచ్చిన జనమే దేశంలో మార్పునకు సంకేతమన్నారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ఆరంభం కావాలన్నారు. ఇంకా 400 రోజులే అధికారం ఉందని బీజేపీ చెబుతోంది అయితే బీజేపీ కేంద్రంలో ఉండేది 399 రోజులు మాత్రమేనని ఎద్దెవా చేశారు. 2023 వచ్చినా రైతుల కష్టాలు అలాగే ఉన్నాయన్న అఖిలేష్ 2024 వచ్చినా బీజేపీ హామీలు కూడా అలాగే ఉంటాయని విమర్శించారు. తెలంగాణలో బీజేపీని తరిమేయండి, యూపీలో కూడా అదే పని చేస్తామన్నారు అఖిలేష్ యాదవ్.