Air Quality in Hyderabad: ఓఆర్‌ఆర్‌ ఆవలకు కాలుష్య పరిశ్రమలు

Air Quality in Hyderabad:నగరంలో మెరుగైన వాయునాణ్యత సాధనకు ప్రభుత్వం నిర్దేశిత, నిర్ణీత కాలవ్యవధికు తగ్గట్టుగా ప్రణాళికలను కచ్చితంగా అమలుచేయాలని రజత్‌కుమార్‌ ఆదేశించారు.

Update: 2020-06-28 07:04 GMT

Air Quality in Hyderabad: నగరంలో మెరుగైన వాయునాణ్యత సాధనకు ప్రభుత్వం నిర్దేశిత, నిర్ణీత కాలవ్యవధికు తగ్గట్టుగా ప్రణాళికలను కచ్చితంగా అమలుచేయాలని రజత్‌కుమార్‌ ఆదేశించారు. అటవీ, పర్యా వరణ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌ అధ్యక్షతన వాయు నాణ్యత పర్యవేక్షక కమిటీ 'హైదరాబాద్‌లో వాయు కాలుష్యం తగ్గింపు' ప్రణాళికలపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ నగరంలో వాహనాలకు బీఎస్‌–6 (భారత ప్రమాణాలు–6) అమలు, ట్రాఫిక్‌ ఫ్లోకు అడ్డంకులు లేకుండా ఉండేందుకు ఏ రకం వాహనాలకు కేటాయించిన లైన్‌లో అవి వెళ్లేలా 'లేన్‌ క్రమశిక్షణ'అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో గాలి నాణ్యత శాటీస్‌ ఫాక్టరీ నుంచి మోడరేట్‌ రేంజ్‌లో ఉందని, దీనిని గుడ్‌ క్వాలిటీగా మార్చేందుకు ప్రభుత్వం కార్యాచరణను రూపొందించిందని రజత్‌కుమార్‌ అన్నారు.

హైదరాబాద్‌లో ఎప్పటికప్పుడు 7 కేంద్రాల ఏర్పాటు చేసామని, వాటి ద్వారా వాయునాణ్యత పర్యవేక్షణకు, వాయు కాలుష్య కారకాల గుర్తింపున కు, జీహెచ్‌ఎంసీ కి రోడ్లు ఊడ్చే యంత్రాలు, వాయు నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం రూ. 11 కోట్లు కేటాయించినట్టు ఆయన తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) వెలుపలికి హైదరాబాద్‌ లోని కాలుష్య కారక పరిశ్రమల తరలింపునకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను సిద్ధంచేయాలని పరిశ్రమల శాఖను వాయు నాణ్యత పర్యవేక్షక కమిటీ ఆదేశించింది. కాలుష్య కారక వాహనాలపై జరిమానాలు, విద్యాసంస్థల బస్సులు సీఎన్‌జీని ఉపయోగించేలా చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రజలకు వాయు నాణ్యతపై అవగాహన కలిగించడానికి 'ఎయిర్‌ క్వాలిటీ డేటా'ప్రచురించాలని టీపీసీబీకి సూచించింది. ఈ సమావేశంలో టీపీసీబీ సభ్యకార్యదర్శి నీతూ ప్రసాద్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.   

Tags:    

Similar News