వివాదాస్పద స్థలంలో నిర్మించిన గోడలను కూల్చివేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు

వివాదాస్పద స్థలంలో నిర్మించిన గోడలను కూల్చివేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు
x
GHMC Demolition of Illegal Buildings
Highlights

ఓయూలో ఉన్న ఓ వివాదాస్పద ఖాళీ స్థలంలో నిర్మించిన ప్రహారీగోడలను సోమవారం జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు.

ఓయూలో ఉన్న ఓ వివాదాస్పద ఖాళీ స్థలంలో నిర్మించిన ప్రహారీగోడలను సోమవారం జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. కొన్ని రోజుల క్రితం ఓ రిటైర్డ్‌ న్యాయమూర్తికి, ఉస్మానియా యూనివర్సిటీ వారికి మధ్య డీడీ కాలనీ ఉస్మానియా యూనివర్సిటీ మధ్యలో ఉన్న స్థలంపై వివాదం జరిగింది. ఈ తరువాత రిటైర్డ్‌ న్యాయమూర్తి భార్య పోలీసులను ఆశ్రయించి వివాదం గురించి ఫిర్యాదు చేసింది. పోలీసులు బందోబస్తు సాయంతో వివాదాస్పద స్థలంలో గోడను కట్టించింది. అది చూసిన ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ వెంటనే జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు గోడ నిర్మించిన స్థలానికి చేరుకుని నిర్మాణాన్ని పరిశీలించారు. ఆ నిర్మాణానికి అనుమతిలేదని వెంటనే దాన్ని కూల్చివేయాలంటూ చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు స్థానిక సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు.

అనంతరం వివాదాస్పద స్థలంలో నిర్మించిన ప్రహారీగోడలను సర్కిల్‌–16 టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ నర్సింగ్‌రావు నేతృత్వంలో సోమవారం జీహెచ్‌ఎంసీ సిబ్బంది కూల్చివేశారు. ఈ స్థలంలో నిర్మాణం కోసం రిటైర్డ్‌ న్యాయమూర్తి కుటుంబం గత కొన్నేళ్ల క్రితం అనుమతులు పొందారని తెలిపారు. కానీ ప్రస్తుతం అనుమతి కాలపరిమితి ముగిసిందని అధికారులు అన్నారు. ఈ మేరకు అనుమతి లేకుండా తాజాగా నిర్మించిన గోడను కూల్చివేశామన్నారు. వారు ఈ స్థలంలో మళ్లీ నిర్మాణాలు చేపట్టాలంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ దరఖాస్తులను నిబంధనలు పాటిస్తూ పరిశీలిస్తామన్నారు. ఈ కూల్చివేతల బృందంలో టౌన్‌ప్లానింగ్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ సాయిబాబా, చైన్‌మన్‌లు బాబామియా, రజ్వీలు కూడా ఉన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories