Hyderabad: హుస్సేన్‌సాగర్‌కు సరికొత్త హంగులు !
హైదరాబాద్ నగరాన్ని తలచుకోగానే ముందుగా గుర్తొచ్చేది హుస్సేన్ సాగర్. దేశ, విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది, దీంతో ఇక్కడి పర్యాటకుల తాకిడి గణనీయంగా ఉంటుంది.
హైదరాబాద్ నగరాన్ని తలచుకోగానే ముందుగా గుర్తొచ్చేది హుస్సేన్ సాగర్. దేశ, విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది, దీంతో ఇక్కడి పర్యాటకుల తాకిడి గణనీయంగా ఉంటుంది.హుస్సేన్ సాగర్ మధ్యలో ఉండే అతి పెద్ద బుద్ధ విగ్రహం సాయం సంధ్యా సమయంలో మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది. సరస్సు చుట్టూరా ఆహ్లాదాన్ని నింపే అందమైన నందనవనాలు, మిరుమిట్లు గొలిపై విద్యుత్ దీపాలు, అంతకు మించి దేశ భక్తికి చాటే అతి పెద్ద జాతీయ జెండా, చిన్న పిల్లలు ఆడుకోవడానికి వాటర్ గేమ్స్ ఇలా హైదరాబాదీలో పర్యాటక క్షేత్రంలో చారిత్రక హుస్సేన్‌సాగర్ తనదైన ఘనతను సొంతం చేసుకుంది.
అంతే కాకుండా నాగార్జున సాగర్ చుట్టుపక్కన ఉన్న ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్క్, సంజీవయ్య పార్క్‌లతో పాటు లేజర్ షో ఇలా దేనికదే ప్రత్యేకత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే సాగర్ ను మరింత అందంగా మలచేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిర్ణయించింది. ఇందుకోసం ల్యాండ్‌స్కేప్ రీ డెవలప్‌మెంట్‌కు హుస్సేన్‌సాగర్ లేక్ మాస్టర్ ప్లాన్ రూపకల్పణ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఆర్‌ఎఫ్‌పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) టెండర్లను అంతర్జాతీయ స్థాయి ఏజెన్సీల నుంచి ఆహ్వానిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మంగళవారం అధికారులు ఏజెన్సీ సమర్పించిన ప్రతిపాదనలను స్వీకరించనున్నారు. ఉత్తమమైన డిజైన్లు, ప్రాజెక్టు వ్యయం లాంటి అంశాలపై చర్చించి అధికారులు అర్హత సాధించిన ఏజెన్సీ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనున్నామని అధికారుల తెలిపారు.