Congress: గాంధీభవన్‌కు చేరిన ఆదిలాబాద్ టికెట్ పంచాయితీ

Congress: ముందు నుంచి పనిచేసిన వారికి మాత్రమే టికెట్లు ఇవ్వాలని డిమాండ్

Update: 2023-10-07 08:18 GMT

Congress: గాంధీభవన్‌కు చేరిన ఆదిలాబాద్ టికెట్ పంచాయితీ

Congress: ఆదిలాబాద్ కాంగ్రెస్ టికెట్ పంచాయితీ గాంధీభవన్ కు చేరింది. కంది శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ స్థానిక నేతలు గాంధీభవన్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సేవ్ కాంగ్రెస్.. నో ఆర్ఎస్‌ఎస్‌ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇస్తే పదవులకు రాజీనామా చేసి.. కాంగ్రెస్ ను ఓడించి తీరుతామని హెచ్చరించారు. ముందు నుంచి పార్టీలో పనిచేస్తున్న వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News