Karimnagar: కరోనా వైరస్ కి నివారణే మంత్రం: ఆదరణ సేవా సమితి

కరీంనగర్ టౌన్: ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న కరోనా వైరస్ కు, నివారణే సరియైన మార్గమని ఆదరణ సేవా సమితి ఫౌండర్ కర్రె పావని అన్నారు.

Update: 2020-03-11 07:55 GMT
ఆదరణ సేవా సమితి

కరీంనగర్ టౌన్: ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న కరోనా వైరస్ కు, నివారణే సరియైన మార్గమని ఆదరణ సేవా సమితి ఫౌండర్ కర్రె పావని అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చెర్ల బూత్కూరు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థినీ, విద్యార్థులకు పరీక్షల ప్యాడ్స్, చేతి రుమాలు పంపిణీ చేశారు. అనంతరం కర్రె పావని మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షా సమయంలో ఒత్తిడికి గురి కావద్దని, ప్రతి రోజు తప్పనిసరిగా ఆరు గంటలు తక్కువకాకుండా నిద్రపోవాలన్నారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతున్న కరోనా వైరస్ నివారించడానికి, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఏటువంటి వైరస్ నైనా ఎదుర్కోవచ్చని, ప్రస్తుతం మెడికల్ షాప్ లలో మాస్క్ లను అధిక ధరకు విక్రయిస్తున్నారని, అందుకు గాను తక్కువ ధరలో లభ్యత అయ్యే పిల్లలకు చేతిరుమాలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదరణ సేవా సమితి సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, గ్రామ సర్పంచ్ రమణ రెడ్డి , ఉప సర్పంచ్ శేఖర్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.



Tags:    

Similar News