ఆధార్ నోటీసులు వ్యవహారంలో బయటకు వస్తోన్న సంచలన నిజాలు

Update: 2020-02-20 06:19 GMT
ఆధార్ ప్రతీకాత్మక చిత్రం

ఆధార్ నోటీసుల వ్యవహారంలో సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి. నోటీసులు అందుకున్న 127 మందిలో ఒకడైన సత్తార్ ఖాన్ 2018లో రోహింగ్య ముస్లింలకు నకిలీ పత్రాలు సృష్టించి వాటితో ఆధార్ కార్డులు ఇప్పించినట్టు సీసీఎస్‌లో కేసు నమోదైంది. నకిలీ పత్రాలతో మొత్తం 127 మందికి రోహింగ్యాలకు ఆధార్ నమోద్ చేయించినట్టు బట్టబయలైంది.

విచారణలో భాగంగా ఆధార్ సంస్థకు రాష్ట్ర పోలీసులు లేఖ రాశారు. పోలీసులు రాసిన లేఖపై స్పందించిన ఆధార్ యాజమాన్యం 127 మంది రోహింగ్య ముస్లింలకు నోటీసులు జారీ చేసింది. సరైన పత్రాలతో తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆధార్ సంస్థ పేర్కొంది. ఏ పత్రాలు లేకపోతే ఆధార్ రద్దు చేస్తామని ఆధార్ సంస్థ హెచ్చరించింది.

 ఈరోజు (గురువారం) జరగాల్సిన నకిలీ ఆధార్ విచారణను యూడీఏఐ రద్దు చేసింది. బాలాపూర్ మెగా గార్డెన్స్‌లో విచారణ అకస్మాత్తుగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. బాలాపూర్ మెగా గార్డెన్స్‌లో విచారణ జరగాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారికి తదుపరి విచారణకు సంబంధించి పలు వివరాలను పోస్టులో పంపింది.

Tags:    

Similar News