Vikarabad: ఆస్తి కోసం సొంత అక్కను హతమార్చేందుకు సుపారీ ఇచ్చిన తమ్ముడు
Vikarabad: పోలీసుల నుంచి వేరే వ్యక్తి పేరు చెప్పి తప్పించుకున్న డేవిడ్
Vikarabad: ఆస్తి కోసం సొంత అక్కను హతమార్చేందుకు సుపారీ ఇచ్చిన తమ్ముడు
Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం సొంత అక్కను హతమార్చేందుకు తమ్ముడు రాజు సుపారీ ఇచ్చాడు. ఇరవై రోజుల క్రితం డేవిడ్ అనే వ్యక్తితో మరో ఇద్దరు కలిసి రాజు అక్క ఆశమ్మను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. గ్రామంలో అనుమానంగా తిరుగుతున్న డేవిడ్‌కి గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులు అప్పగించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందు వేరొకరి పేరు చెప్పి డేవిడ్ ధారూర్ వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లిన డేవిడ్ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బసిరెడ్డిపల్లి గ్రామస్తుల దాడి కారణంగానే డేవిడ్ చనిపోయాడని కుటుంబసభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. డేవిడ్ ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు కాల్ డేటా ఆధారంగా పోలీసులు కేసును ఛేధించారు. ఆస్తి కోసం సొంత అక్క ఆశమ్మను హత్య చేసేందుకు సుపారీ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో రాజు తన నేరాన్ని ఒప్పుకోవడంతో పోలీసులు రిమాండ్‌కు తరలించారు.