Kamareddy: పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
Kamareddy: సోదరుడికి సెల్ఫీ వీడియో పంపిన యువకుడు హరిబాబు
Kamareddy: పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
Kamareddy: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని బాగీర్తిపల్లి గ్రామానికి చెందిన హరిబాబు తన పొలం వద్ద తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోదరుడి వరుసైన చిన్నాన్న కుమారుడు దుర్గా శైలానికి సెల్ఫీ వీడియో పంపాడు. అందులో తన ఆత్మహత్యకు గ్రామానికి చెందిన మంద నవీన్, మెదక్ జిల్లా అక్కన్నపేటకు చెందిన తన అత్తమ్మ పిట్ట లక్ష్మి, తన భార్య నవనీత కారణమని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. సెల్పీ వీడియో చూసిన శైలం.. ఆ విషయాన్ని హరిబాబు కుటుంబీకులకు చెప్పాడు.
కుటుంబీకులు పొలం వద్దకు వెళ్లి చూడగా.. చెట్టుకు వేలాడుతూ కనిపించాడు హరిబాబు హరిబాబును చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడి తండ్రి నారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.