Kamareddy: వైద్యం వికటించి మృతి చెందిన మూడేళ్ల చిన్నారి
Kamareddy: తమకు న్యాయం చేయాలని డిమాండ్
Kamareddy: వైద్యం వికటించి మృతి చెందిన మూడేళ్ల చిన్నారి
Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం వికటించి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన మనుశ్రీ జ్వరం, విరోచనాలు కావడంతో తల్లిదండ్రులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో వైద్యులు పరీక్షలు చేస్తుండగా పాపకి ఫిట్స్ వచ్చాయి. అనంతరం చికిత్స పొందుతూ మనుశ్రీ మృతి చెందింది. అయితే మనుశ్రీ మృతికి వైద్యులే కారణమంటూ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.