Cash for Vote: రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
Cash for Vote: రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది.
రేవంత్ రెడ్డి(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )
Cash for Vote: రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. ఓటుకు నోటులో మిగిలిన సాక్షలందరి చీఫ్ ఎగ్జామినేషన్ పూర్తయిన తరువాతనే క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని సుప్రీం కోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయవద్దని ఏసీబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాలలో సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.