Siddipet: న్యాయవాదిని మింగేసిన రోడ్డు ప్రమాదం

Siddipet: అక్కడికక్కడే మృతి చెందిన న్యాయవాది దశమంతరెడ్డి

Update: 2022-12-25 12:03 GMT

Siddipet: న్యాయవాదిని మింగేసిన రోడ్డు ప్రమాదం

Siddipet: ఘోర రోడ్డు ప్రమాదం న్యాయవాదిని మింగేసింది. సిద్దిపేట రంగదాంపల్లి చౌరస్తాలో లారీ-బైక్ ఢీ కొని సీనియర్ న్యాయవాది దశమంతరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నంగునూరు మండలం ముండ్రాయి గ్రామానికి చెందిన దశమంత రెడ్డి ద్విచక్ర వాహనంపై సిద్దిపేట వెళుతుండగా రంగదాంపల్లి చౌరస్తా వద్ద హైదరాబాద్ నుండి వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం సంభవించింది. 

Tags:    

Similar News