మద్యం మత్తులో కొడుకుపై దాడి చేసిన తల్లి

* బ్లేడ్‌తో కొడుకుపై దాడి * తల్లిని అడ్డుకున్న స్థానికులు

Update: 2021-02-16 04:41 GMT

Representational Image

హైదరాబాద్‌ నగర శివారు రాజేంద్రనగర్‌‌లో దారుణం జరిగింది. రాజేంద్రనగర్ సర్కిల్‌ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగిన మైకంలో ఓ తల్లి విచక్షణ కోల్పోయింది. కాపాడాల్సిన చేతులే కన్న కొడుకు రక్తం కళ్లారా చూసింది. తన పేగుబంధమే తనకు భారం అయిందని భావించింది. మద్యం మత్తులో తానేం చేస్తున్నానో తానే తెలియని మైకంలో మునిగిపోయింది. కొడుకు తొడలపై బ్లేడుతో దాడి చేసింది. పిల్లాడి అరుపులు విన్న స్థానికులు వచ్చి. తల్లి చెర నుంచి ఆ చిన్నారిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News