Nalgonda: మిర్యాలగూడలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం

Nalgonda: బస్ వెనుక టైర్ పేలడంతో ప్రమాదం

Update: 2023-09-08 03:47 GMT

Nalgonda: మిర్యాలగూడలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం

Nalgonda: నల్గొండ జిల్లా పరిధిలో ప్రైవేట్‌ బస్‌ అగ్నిప్రమాదానికి గురైంది. మిర్యాలగూడ -హనుమాన్‌పేట ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డుపై ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్‌ తగలబడింది. కావేరి ట్రావెల్స్ బస్‌లో మంటలు చెలరేగాయి. బస్‌ వెనుక టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కావేరి బస్సు నెల్లూరు వెళ్తోంది. ప్రమాద సమయంలో బస్‌లో 26 మంది ప్రయాణికులున్నారు. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Tags:    

Similar News