Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు
Raja Singh: దసరా రోజున ఆయుధ పూజలో కత్తులు, ఆయుధాలను.. బహిరంగంగా ప్రదర్శించినట్లు రాజాసింగ్‌పై ఫిర్యాదు
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు
Raja Singh: గోషామహల్ బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. దసరా రోజు ఆయుధ పూజ సందర్భంగా నిషేధిత ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంతో పోలీసులు షోకాజ్ నోటీసులు పంపించారు. విద్వేష ప్రసంగానికి సంబంధించి రెండు విచారణా నోటీసులు ఆయనకు జారీ చేశారు. కాగా తుపాకులు, కత్తులు ప్రదర్శించి రాజాసింగ్ పూజలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్టోబర్ 16న రాజాసింగ్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోలో విద్వేషపూరిత ప్రసంగం ఉందని పోలీసులు తెలిపారు.