Exit Polls: 90శాతం నిజమైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

Exit Polls: ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన 30సంస్థలు.. 60కిపైగా స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా

Update: 2023-12-04 04:17 GMT

Exit Polls: 90శాతం నిజమైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

Exit Polls: తెలంగాణలో ఈసారి ఎగ్జిట్ పోల్స్ వాస్తవరూపం దాల్చాయి. 90శాతం మేర ఎగ్జిట్ పోల్స్ నిజం అయ్యాయి. గతనెల 30న 119 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అదేరోజు దాదాపు 30సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. 60కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి అధికార పగ్గాలు చేపడుతుందని అన్నిసంస్థలు అంచనా వేశాయి. బీఆర్‌ఎస్‌కు 40స్థానాలే వస్తాయని పేర్కొన్నాయి.

కౌంటింగ్‌లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల అంచనాలు నిజం అయ్యాయి. 2018 ఎన్నికల్లో దాదాపు సగం సంస్థల అంచనాలు తప్పవ్వగా.. ఈసారి కేవలం మూడు సంస్థలు ప్రకటించిన అంచనాలే తప్పయ్యాయి. న్యూస్‌ ఎక్స్‌, టైమ్స్‌నౌ సీఎన్‌ఎక్స్‌, పల్స్‌టుడే ఎగ్జిట్‌పోల్స్‌ ఈసారి తప్పాయి. 60-70 స్థానాలు సాధించి బీఆర్‌ఎస్‌ మూడోసారి అధికారంలోకి వస్తుందని ఈ సంస్థలు వెల్లడించాయి. కాంగ్రెస్‌ 57-62, బీఆర్‌ఎస్‌ 35-41 స్థానాల్లో గెలుస్తుందన్న ఆపరేషన్‌ చాణక్య అంచనా నిజమైంది.

కాంగ్రెస్‌కు 65, బీఆర్‌ఎస్‌కు 41స్థానాలు వస్తాయని టుడేస్‌ చాణక్య చెప్పింది. ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్‌, ఏబీపీ సీఓటర్‌, ఎన్డీటీవీ, పీపుల్స్‌ పల్స్‌, పోల్‌ ట్రెండ్‌ అండ్‌ స్ర్టాటజీ గ్రూప్‌ సంస్థలు పేర్కొన్న ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు నిజమయ్యాయి. అయితే ఎగ్జిట్ పోల్స్‌ను అధికార బీఆర్ఎస్ పట్టించుకోలేదు. అయినా ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజం కావడం పార్టీ శ్రేణులను నిరుత్సాహ పరిచింది. 

Tags:    

Similar News