Nizamabad: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో 80ఏళ్ల వృద్ధురాలి ధర్నా

Nizamabad: 20 గుంటల భూమి కోసం ధర్నాకు దిగిన సాయమ్మ

Update: 2021-07-17 08:09 GMT

భూమికోసం ధర్నా చేస్తున్న వృద్ధురాలు 

Nizamabad: అధికారుల అలసత్వం ఓ వృద్ధురాలి పాలిట శాపంగా మారింది. ఎనిమిది పదుల వయసులో కాళ్లరిగేలా తిరిగి చివరకు ధర్నా చేసే పరిస్థితి తీసుకొచ్చింది. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ఆచన్‌పల్లికి చెందిన ఎనభై ఏళ్ల వృద్ధురాలు భూమి కోసం ధర్నాకు దిగింది. గతేడాది తన భర్త మరణించగా ఆయన పేరు మీద ఉన్న 20 గుంటల భూమి కోసం తహశీల్దార్ ఆఫీస్‌కు వెళ్లింది. అప్పటి నుంచి రేపు, మాపు అంటూ తిప్పడం తప్ప అధికారులు చేసిందేమీ లేదు. నాలుగు అడుగులు నడవడం కూడా చేతకాని వయసులో కాళ్లరిగేలా ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతూనే ఉంది. బాధ్యత మరిచిన అధికారులు ఆ వృద్ధురాలిని చూసి కూడా కనికరించలేదు. ఏడాదిగా ఆఫీస్ చుట్టు తిప్పుతూనే ఉన్నారు. దీంతో చేసేదేమీ లేక కుటుంబసభ్యులతో పాటు ధర్నాకు దిగింది. 

Full View


Tags:    

Similar News