Hyderabad: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. యువకుడు మృతి
Hyderabad: కార్వాన్ మురిగిచౌక్ దగ్గర వ్యక్తి హత్య
Hyderabad: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. యువకుడు మృతి
Hyderabad: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కాల్పులు కలకలం రేపాయి. టపాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్వాన్ మురిగి చౌక్ దగ్గర ఓ యువకుడిని కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. పాయింట్ బ్లాంక్‌లో ఆకాష్ సింగ్‌ను కాల్చినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. పాత కక్షల వల్లే ఈ హత్య జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో గన్‌తో పాటు కత్తులు కూడా దొరికినట్లు సౌత్ వెస్ట్ జోన్ డిసిపి కిరణ్ తెలిపారు.