రేపటి నుంచి హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ పరీక్షలు

Update: 2020-02-02 03:57 GMT

కరోనా వైరస్‌ గురించి ఆందోళన చెందవద్దని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. సోమవారం నుంచి గాంధీ ఆస్పత్రిలో ఈ పరీక్షలు మొదలు పెడతామని అన్నారు. వైరస్‌ వ్యాప్తిచెందకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. వైరస్‌ వ్యాధులు సోకినప్పుడు ఉపయోగించే మందులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామన్నారు. 

ఇక కరోనా వైరస్‌ కారణంగా చైనాలో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. కరోనా వైరస్‌తో శనివారం ఒక్కరోజే 45 మంది మృత్యువాతపడ్డారు. అయితే ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ‌్య 304కి చేరింది. వ్యాధి తీవ్ర ఎక్కువగా ఉన్న హుబే ప్రావిన్స్‌లో శనివారం ఒక్కరోజే కొత్తగా 2వేల కేసులు నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. 

Tags:    

Similar News