WhatsApp: సంచలనం..దేశంలో వాట్సాప్ బ్యాన్
WhatsApp: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని అనుసంధానించే మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్‌కు రష్యా గట్టి షాకిచ్చింది. గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, వాట్సాప్‌ను తమ దేశంలో పూర్తిగా బ్లాక్ చేస్తున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అధికారికంగా ప్రకటించారు.
WhatsApp: సంచలనం..దేశంలో వాట్సాప్ బ్యాన్
WhatsApp: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని అనుసంధానించే మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్‌కు రష్యా గట్టి షాకిచ్చింది. గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, వాట్సాప్‌ను తమ దేశంలో పూర్తిగా బ్లాక్ చేస్తున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం అంతర్జాతీయ టెక్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
రష్యా ప్రభుత్వం ఆరోపణల ప్రకారం.. నేరాలను అరికట్టడానికి అవసరమైన డేటాను భద్రతా సంస్థలతో పంచుకోవడానికి వాట్సాప్ నిరాకరిస్తోంది. స్థానిక చట్టాలను తుంగలో తొక్కుతోందని రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, దీనిపై వాట్సాప్ ఘాటుగా స్పందించింది. సుమారు 10 కోట్ల మంది వినియోగదారుల సురక్షితమైన, ప్రైవేట్ కమ్యూనికేషన్‌ను తుంచివేసి, వారిని ప్రభుత్వ నిఘా నీడలో ఉండే యాప్ వైపు మళ్లించే కుట్ర ఇదని ఆరోపించింది.
వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా రష్యా ప్రభుత్వం ‘మ్యాక్స్’ అనే స్వదేశీ సూపర్ యాప్‌ను తెరపైకి తెచ్చింది. ఇది చైనాలోని వీచాట్ తరహాలో పనిచేస్తుంది.కేవలం మెసేజింగ్ మాత్రమే కాకుండా బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు, షాపింగ్ అన్నీ ఒకే చోట లభిస్తాయి.ఈ యాప్ ద్వారా పౌరుల ప్రతి కదలికపై ప్రభుత్వం నిఘా ఉంచే అవకాశం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కేవలం వాట్సాప్ మాత్రమే కాదు, రష్యాలో పుట్టిన టెలిగ్రామ్ సేవలపై కూడా పరిమితులు విధించారు. ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లపై ఆంక్షలు ఉన్న రష్యాలో.. ఇప్పుడు వాట్సాప్ నిషేధంతో డిజిటల్ కమ్యూనికేషన్‌పై ప్రభుత్వం పూర్తి పట్టు సాధించినట్లయింది.
రష్యా తీసుకున్న ఈ నిర్ణయం పౌరుల స్వేచ్ఛను హరించడమేనని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు, స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని రష్యా సమర్థించుకుంటోంది. ఏదేమైనా, ఈ డిజిటల్ యుద్ధం భవిష్యత్తులో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.