200ఎంపీ కెమెరాతో వచ్చేసిన వివో ఎక్స్300ఎస్.. ఏకంగా సినిమాలే తీయోచ్చు.. ధరెంతంటే?

Vivo X300 Ultra: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన అత్యంత శక్తివంతమైన 'ఎక్స్300' సిరీస్‌ను చైనాలో గ్రాండ్ గా విడుదల చేసింది.

Update: 2026-03-31 04:44 GMT

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన అత్యంత శక్తివంతమైన 'ఎక్స్300' సిరీస్‌ను చైనాలో గ్రాండ్ గా విడుదల చేసింది. ఇందులో వివో ఎక్స్300 అల్ట్రా, వివో ఎక్స్300ఎస్ అనే రెండు మోడళ్లు ఉన్నాయి. అత్యాధునిక కెమెరా సాంకేతికత, సరికొత్త ప్రాసెసర్లు, భారీ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్లు టెక్ ప్రపంచంలో సరికొత్త సంచలనంగా మారింది.

వివో ఎక్స్300 అల్ట్రా ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.82 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చారు. ఇది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో జైస్ సంస్థతో రూపొందించిన 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు, మరో 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండటం విశేషం. ఇది 105 రెట్లు డిజిటల్ జూమ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

మరోవైపు వివో ఎక్స్300ఎస్ మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌తో వస్తోంది. ఇందులో 6.78 అంగుళాల స్క్రీన్ , భారీ 7,100 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 90 వాట్ల వేగవంతమైన ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

ధర..

వివో ఎక్స్300 అల్ట్రా ప్రారంభ ధర సుమారు 95,900 రూపాయలుగా (చైనా కరెన్సీ ప్రకారం) నిర్ణయించారు. దీని టాప్ ఎండ్ మోడల్ 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్‌తో సుమారు 1,23,300 రూపాయలకు లభిస్తుంది.

వివో ఎక్స్300ఎస్ బేస్ వేరియంట్ ధర సుమారు 68,500 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్లు బ్లాక్, సిల్వర్, గ్రీన్ వంటి ఆకర్షణీయమైన రంగులలో లభ్యమవుతాయి. ఏప్రిల్ 3 నుంచి వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

అదనపు ఫీచర్లు..

ఈ ఫోన్లలో అల్ట్రాసోనిక్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్ (అల్ట్రా మోడల్‌లో), ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 6 వంటి అత్యాధునిక సాఫ్ట్‌వేర్ ఫీచర్లు ఉన్నాయి. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీని ఇష్టపడే వారి కోసం ప్రత్యేకంగా ఫోటోగ్రాఫర్ కిట్‌ను కూడా వివో అందుబాటులోకి తెచ్చింది. నీటిలో పడినా పాడవకుండా ఉండేలా వీటికి ప్రత్యేక రక్షణ కవచాన్ని కూడా అందించారు.

Tags:    

Similar News