Maruti Fronx: లీటరుకు 35 కిమీల మైలేజీ.. మిడిల్ క్లాస్ డ్రీమ్ కార్ గా రీ ఎంట్రీ ఇవ్వనున్న ఫ్రాంక్స్..!

Maruti Fronx Hybrid 2026: మారుత సుజుకి కంపెనీ మిడిల్ క్లాస్ ప్రజల కోసం ఓ అద్భుతమైన కార్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఫ్రాంక్స్ మోడల్‌ను సరికొత్త 'హైబ్రిడ్' అవతారంలో తీసుకరానుంది.

Update: 2026-03-31 04:59 GMT

Maruti Fronx: లీటరుకు 35 కిమీల మైలేజీ.. మిడిల్ క్లాస్ డ్రీమ్ కార్ గా రీ ఎంట్రీ ఇవ్వనున్న ఫ్రాంక్స్..!

Maruti Fronx Hybrid 2026: భారత ఆటోమొబైల్ రంగంలో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న మారుతి సుజుకి, ఇప్పుడు మధ్యతరగతి ప్రజల కలలను నిజం చేసేందుకు సిద్ధమైంది. తన అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంక్స్ మోడల్‌ను సరికొత్త 'హైబ్రిడ్' అవతారంలో 2026 చివరి నాటికి మార్కెట్లోకి తీసుకురానుంది. అత్యాధునిక సాంకేతికత, అదిరిపోయే ఫీచర్లతో రానున్న ఈ కారు పెట్రోల్ ఖర్చులను భారీగా తగ్గించనుంది.

మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్ పాత మోడల్ కంటే మరింత ఆకర్షణీయంగా ఉండబోతోంది. దీని ముందు భాగంలో పదునైన ఎల్‌ఈడీ వెలుగులు, క్రోమ్ మెరుపులతో కూడిన గ్రిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పక్క భాగంలో 16 అంగుళాల అలాయ్ వీల్స్, పైన సిల్వర్ కలర్ రూఫ్ రైల్స్ కారుకు ప్రీమియం లుక్ ఇస్తాయి. వెనుక వైపు ఎల్‌ఈడీ దీపాలు, హైబ్రిడ్ సింబల్స్ ఈ కారును ప్రత్యేకంగా చూపిస్తాయి. బలమైన బాడీ నిర్మాణం వల్ల ప్రయాణం సురక్షితంగా, సాఫీగా సాగుతుంది.

లోపల ఎలా ఉందంటే?

కారు లోపలి భాగం ఐదుగురు ప్రయాణించడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ముందు సీటు కింద హైబ్రిడ్ బ్యాటరీని అమర్చడం వల్ల బూట్ స్పేస్ ఏమాత్రం తగ్గలేదు. ఇందులో 9 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360 డిగ్రీల కెమెరా, సన్‌రూఫ్ వంటి విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి. డ్రైవర్ కోసం ప్రత్యేకంగా సమాచారాన్ని అందించే హెడ్-అప్ డిస్‌ప్లే కూడా ఇందులో ఉండటం విశేషం.

అత్యున్నత రక్షణ, సేఫ్టీ ఫీచర్లు..

భద్రత విషయంలో మారుతి ఎక్కడా రాజీ పడలేదు. ఈ కారులో 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ వంటి ప్రాథమిక భద్రతా ఫీచర్లతో పాటు, సరికొత్త 'ఏడీఏఎస్' (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) సాంకేతికతను జోడించారు. ఇది ప్రమాదాలను ముందే గుర్తించి డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. కొండ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు కారు వెనక్కి జారకుండా ఉండేందుకు 'హిల్ హోల్డ్ అసిస్ట్' వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

మైలేజీలో సరికొత్త రికార్డు..

ఈ హైబ్రిడ్ కారులో 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో పాటు పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు. పెట్రోల్ ఇంజిన్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంటే, మోటారు కారును ముందుకు నడిపిస్తుంది. ఈ అధునాతన వ్యవస్థ వల్ల ఈ కారు లీటరు పెట్రోల్‌కు సుమారు 35 నుంచి 37 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని అంచనా.

ధర..

సాధారణ ఫ్రాంక్స్ కంటే దీని ధర సుమారు 2 లక్షల రూపాయలు ఎక్కువగా ఉండవచ్చు. ఎక్స్-షోరూమ్ ధర 8 లక్షల నుంచి 15 లక్షల రూపాయల మధ్య ఉండే అవకాశం ఉంది. పెట్రోల్ ఖర్చులను ఆదా చేయాలనుకునే కుటుంబాలకు ఇది ఒక అద్భుతమైన ఎంపిక కానుంది.

Tags:    

Similar News