Layoffs: మీ సేవలు ఇక చాలు వెళ్లండి..700 మందికి షాకిచ్చిన టెక్ దిగ్గజం
Meta Lays Off 700 Employees: ఏఐ రంగంలో దూసుకుపోయేందుకు మెటా సంస్థ భారీ ప్రక్షాళన చేపట్టింది.
Layoffs : మీ సేవలు ఇక చాలు వెళ్లండి..700 మందికి షాకిచ్చిన టెక్ దిగ్గజం
Meta Lays Off 700 Employees: టెక్ దిగ్గజం, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అగ్రగామిగా నిలవాలనే కసి ఒకవైపు.. సంస్థను గాడిలో పెట్టాలనే లక్ష్యం మరోవైపు.. వెరసి ఏకంగా 700 మంది నిపుణులైన ఉద్యోగులను ఇంటికి పంపేందుకు మార్క్ జుకర్‌బర్గ్ సిద్ధమయ్యారు. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఈ వార్త ఇప్పుడు గ్లోబల్ టెక్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఎందుకు ఈ నిర్ణయం?
మెటా తన ఏఐ కార్యకలాపాలను కేవలం వేగవంతం చేయడమే కాకుండా, విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో ఒకే రకమైన పనులు చేసే టీమ్స్ ఎక్కువగా ఉండటం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని మెటా గుర్తించింది. ముఖ్యంగా.. AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్,ఫండమెంటల్ AI రీసెర్చ్ ,ప్రొడక్ట్ సంబంధిత ఏఐ టీమ్స్, ఈ విభాగాల్లోనే అత్యధికంగా తొలగింపులు జరిగాయి. సంస్థను మరింతగా స్ట్రీమ్‌లైన్ చేసి, ఏఐ రేసులో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇవ్వడమే జుకర్‌బర్గ్ అసలు ప్లాన్.
ఉద్యోగులకు ఊరటనిచ్చే పరిహారం
ఉద్యోగాల నుంచి తొలగించినప్పటికీ, మెటా తన ఉద్యోగుల పట్ల మానవీయ కోణంలో స్పందించింది. బాధితులకు భారీ స్థాయిలో పరిహారం ప్రకటించింది.వారు పనిచేసిన ప్రతి ఏడాదికి అదనంగా రెండు వారాల వేతనాన్ని పరిహారంగా అందించనున్నారు. ఈ ప్యాకేజీ ఉద్యోగులకు కొంతవరకు ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ, నిపుణులైన ఏఐ ఇంజనీర్లను వదులుకోవడం మెటా భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఏఐ రేసులో మెటా నెక్స్ట్ స్టెప్
గత రెండేళ్లుగా మెటా తన ఫోకస్‌ను మెటావర్స్ నుంచి పూర్తిగా ఏఐ వైపు మళ్లించింది. ఎల్‌ఎల్‌ఎమ్ మోడల్స్, ఏఐ ఏజెంట్స్ వంటి విభాగాల్లో దూసుకుపోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే అనవసరమైన విభాగాలను తొలగించి, మరింత చురుకైన టీమ్స్‌తో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ ప్రక్షాళన మెటాకు విజయవంతమైన ఫలితాలను ఇస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి.