ప్రపంచంలోనే చవకైన 7 సీటర్ ఎంపీవీ.. పెద్ద ఫ్యామిలీకి ఫర్ ఫెక్ట్.. రూ.6 లక్షలలోపే!

Cheapest 7 Seater MPV: భారత మార్కెట్‌లో తక్కువ ధరలో పెద్ద కుటుంబానికి సరిపోయే కార్లు అరుదుగా ఉంటాయి.

Update: 2026-03-23 16:30 GMT

ప్రపంచంలోనే చవకైన 7 సీటర్ ఎంపీవీ.. పెద్ద ఫ్యామిలీకి ఫర్ ఫెక్ట్.. రూ.6 లక్షలలోపే!

Cheapest 7 Seater MPV: భారత మార్కెట్‌లో తక్కువ ధరలో పెద్ద కుటుంబానికి సరిపోయే కార్లు అరుదుగా ఉంటాయి. కానీ Renault Triber మాత్రం కేవలం రూ.5.76 లక్షల ప్రారంభ ధరతో ప్రపంచంలోనే అత్యంత చవకైన 7-సీటర్ MPVగా నిలిచింది. మంచి స్పేస్, ఆధునిక ఫీచర్లు, భద్రతా సదుపాయాలతో ఇది కుటుంబాలకు ఆకర్షణీయమైన ఎంపికగా మారుతోంది.

Cheapest 7 Seater MPV: ఫ్రెంచ్ ఆటోమొబైల్ కంపెనీ రెనాల్ట్ (Renault) తయారు చేసిన Renault Triber భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్ 7-సీటర్ కార్లలో ఒకటిగా నిలిచింది. ఈ కార్ ప్రారంభ ధర కేవలం రూ.5.76 లక్షలు మాత్రమే. ఈ ధరలో అందుబాటులో ఉండే 7-సీటర్ ఎంపీవీ ప్రపంచంలో మరొకటి లేదని చెప్పొచ్చు. తక్కువ ఖర్చుతో పెద్ద కుటుంబానికి సరిపడే వాహనం కావాలనుకునే వారికి ఇది సరైన ఎంపికగా మారింది.

ఇంజిన్, పనితీరు..

కొత్త రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) లో 1.0 లీటర్, 3 సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 72 HP పవర్, 96 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్‌లో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు ఏఎంటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

అదనంగా వినియోగదారులు డీలర్‌షిప్ స్థాయిలో సీఎన్జీ రిట్రోఫిట్‌మెంట్ కూడా చేయించుకోవచ్చు. అయితే, దీనికి అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కంపెనీ ఈ సీఎన్జీ కిట్‌పై మూడు సంవత్సరాల వారంటీ అందిస్తుంది.

భద్రతా ఫీచర్లు..

భద్రత విషయంలో కూడా రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) మంచి ఫీచర్లను అందిస్తోంది. ఇందులో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్స్ అందించారు. అదనంగా ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ (EBD) వంటి సిస్టమ్ ఉండటం వల్ల బ్రేకింగ్ సమయంలో కార్ మరింత స్థిరంగా ఉంటుంది. ఈ కార్ బిల్డ్ క్వాలిటీ కూడా బలంగా ఉండటంతో కుటుంబ ప్రయాణాలకు మరింత భద్రతను అందిస్తుంది.

ఆధునిక టెక్నాలజీ ఫీచర్లు..

కొత్త ట్రైబర్ లో ఆధునిక టెక్నాలజీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందిస్తున్నారు. అదనంగా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

రెయిన్ సెన్సింగ్ వైపర్లు, డ్రైవర్ డిజిటల్ డిస్‌ప్లే కూడా డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. కొత్త డిజైన్‌తో మరింత స్టైలిష్..

రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో డిజైన్‌లో కూడా మార్పులు చేశారు. ఇందులో కొత్త 2డీ లోగో, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, DRLలు ఉన్నాయి.

ఈ హెడ్‌ల్యాంప్స్ పూర్తిగా ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి. రాత్రి సమయంలో స్వయంగా ఆన్ అవుతాయి. అదనంగా ఫాగ్ ల్యాంప్స్, రీడిజైన్ గ్రిల్, బ్లాక్ ఫినిష్ టెయిల్ ల్యాంప్స్ కార్‌కు స్టైలిష్, ఆధునిక లుక్‌ను అందిస్తున్నాయి.

పెద్ద కుటుంబానికి సరైన ఎంపిక..

ట్రైబర్ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఏడుగురు సౌకర్యంగా కూర్చోవచ్చు. అవసరాన్ని బట్టి మూడో వరుస సీట్లను మడతపెట్టి అదనపు బూట్ స్పేస్ కూడా పొందవచ్చు. అందువల్ల కుటుంబ ప్రయాణాలు, లాంగ్ డ్రైవ్స్, రోజువారీ వినియోగానికి ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు.

Tags:    

Similar News