WhatsApp: చదివిన 15 నిమిషాల్లోనే మెసేజ్ మాయం.. వాట్సాప్‌లో న్యూ సీక్రెట్ ఫీచర్..!

WhatsApp New Feature: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్ ఇప్పుడు మరో కీలక సేఫ్టీ ఫీచర్‌ను తీసుకురాబోతోంది. కొత్త అప్‌డేట్‌లో భాగంగా మెసేజ్ చదివిన తర్వాత స్వయంగా డిలీట్ అయ్యే ఆఫ్షన్ అందుబాటులోకి రానుంది. వ్యక్తిగత సమాచారం రక్షణలో ఇది కీలక మార్పు తీసుకురానుంది.

Update: 2026-03-22 13:40 GMT

WhatsApp: చదివిన 15 నిమిషాల్లోనే మెసేజ్ మాయం.. వాట్సాప్‌లో న్యూ సీక్రెట్ ఫీచర్..!

WhatsApp After Reading Option: మెటా సంస్థకు చెందిన ప్రముఖ యాప్ వాట్సాప్, “డిసప్పియరింగ్ మెసేజ్” ఫీచర్‌లో కొత్త మార్పులు తీసుకురాబోతోంది. “రీడ్ ఆఫర్ట్” అనే కొత్త ఎంపిక ద్వారా మెసేజ్ చదివిన 15 నిమిషాల తర్వాత స్వయంగా చాట్ నుంచి తొలగిపోతుంది. ఈ ఫీచర్ వినియోగదారుల గోప్యతను మరింత బలపరుస్తుంది.

ప్రస్తుత ఆప్షన్లతో పోలిస్తే మరింత కొత్తదనం..

ప్రస్తుతం వినియోగదారులకు 24 గంటలు, 7 రోజులు, 90 రోజులు అనే మూడు ఎంపికలు మాత్రమే ఉన్నాయి. ఈ కాలవ్యవధిలో మెసేజ్‌లు ఆటో మెటిక్ గా మాయం అవుతాయి. కానీ గోప్యత అవసరాల కోసం ఈ సమయం కొంత ఎక్కువగా అనిపించేది. తాజాగా కొత్త ఎంపికతో ఆ సమస్యకు పరిష్కారం లభించనుంది.

సున్నితమైన సమాచారానికి మరింత రక్షణ..

ఓటీపీలు, ధృవీకరణ కోడ్‌లు వంటి సున్నితమైన వివరాలను పంచుకునే సమయంలో ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. మెసేజ్ చదివిన వెంటనే కొద్దిసేపట్లో అది పూర్తిగా తొలగిపోవడం వల్ల ఇతరుల చేతుల్లోకి ఈ సమాచారం వెళ్లే ప్రమాదం తగ్గుతుంది.

“సీ వన్స్ ఓన్లీ” తరహా సదుపాయం..

ఇప్పటికే యాప్‌లో “ఒకసారి మాత్రమే చూడండి” అనే సదుపాయం ఉంది. ఫోటోలు లేదా వాయిస్ సందేశాలను ఒక్కసారి మాత్రమే చూడగలిగే విధంగా పంపవచ్చు. ఇప్పుడు అదే తరహా సదుపాయం సాధారణ సందేశాలకు కూడా అందుబాటులోకి రానుంది.

15 నిమిషాల టైమర్ ఎలా పనిచేస్తుంది?

ఈ కొత్త ఆఫ్షన్ ఎంచుకున్నప్పుడు, మెసేజ్ పంపిన తర్వాత అది పంపినవారి చాట్‌లో 15 నిమిషాల తర్వాత తొలగిపోతుంది. స్వీకరించిన వ్యక్తి మెసేజ్ చదివిన తర్వాత మరో 15 నిమిషాల్లో అతని చాట్ నుంచి కూడా మాయం అవుతుంది. ప్రతి చాట్‌కు వేర్వేరుగా ఈ సెట్టింగ్‌ను అమలు చేసుకోవచ్చు.

ఇంకా అభివృద్ధి దశలోనే..

ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. గోప్యతపై దృష్టి పెట్టిన ఈ మార్పు వాట్సాప్ వినియోగాన్ని మరింత సురక్షితంగా మార్చనుంది.

Tags:    

Similar News