iPhone: 200ఎంపీ కెమెరాతో ఐఫోన్‌.. శాంసంగ్, ఒప్పోలకు చెమటలు పట్టిస్తోన్న యాపిల్

Apple 200MP Camera iPhone: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ తన రాబోయే ఐఫోన్ మోడళ్లలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఏకంగా 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఫోన్ ప్లాన్ చేస్తోంది.

Update: 2026-03-29 12:24 GMT

iPhone: 200ఎంపీ కెమెరాతో ఐఫోన్‌.. శాంసంగ్, ఒప్పోలకు చెమటలు పట్టిస్తోన్న యాపిల్

Apple 200MP Camera iPhone: ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ కెమెరా నాణ్యతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు యాపిల్ తన తదుపరి తరం ఫోన్లలో ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా సెన్సార్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సాంకేతికత టెస్టింగ్ దశలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనివల్ల వినియోగదారులు అత్యంత స్పష్టమైన ఫొటోలను తీసుకునే అవకాశం ఉంటుంది.

భారీ సెన్సార్, అత్యాధునిక సాంకేతికత..

యాపిల్ పరీక్షిస్తున్న ఈ కొత్త సెన్సార్ పరిమాణం సుమారు 1/1.12 అంగుళాలు ఉండవచ్చని తెలుస్తోంది. ఇది సోనీ సంస్థకు చెందిన పవర్ ఫుల్ సెన్సార్‌లను పోలి ఉంటుందని సమాచారం. భారీ సెన్సార్ ఉండటం వల్ల ఎక్కువ లైట్ ను గ్రహించి, తక్కువ కాంతి ఉన్న ప్రదేశాలలో లేదా రాత్రి సమయాల్లో కూడా అద్భుతమైన క్వాలిటీతో ఫొటోలను తీయవచ్చు. ప్రస్తుతం ఉన్న 48 మెగాపిక్సెల్ కెమెరాలతో పోలిస్తే ఇది చాలా రెట్లు మెరుగ్గా పని చేస్తుంది.

పోటీదారులకు సవాల్..

శామ్‌సంగ్, ఒప్పో వంటి కంపెనీలు ఇప్పటికే తమ ఖరీదైన ఫోన్లలో 200 మెగాపిక్సెల్ సెన్సార్‌లను వాడుతున్నాయి. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా నుంచి నేటి వరకు ఈ సాంకేతికతను కొనసాగిస్తోంది. అయితే యాపిల్ ఎప్పుడూ కొత్త సాంకేతికతను పూర్తిగా పరీక్షించి, వినియోగదారులకు నాణ్యమైన అనుభూతిని ఇస్తుందని నమ్మకం కలిగిన తర్వాతే విడుదల చేస్తుంది. ఇప్పుడు యాపిల్ కూడా ఈ రేసులోకి రావడంతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ మరింత తీవ్రం కానుంది.

ఫొటోగ్రఫీ ప్రియులకు పండగే..

ఈ 200 మెగాపిక్సెల్ కెమెరా వల్ల ఫొటోలను క్రాప్ చేసిన తర్వాత కూడా ఏమాత్రం క్వాలిటీ తగ్గదు. వీడియో రికార్డింగ్‌లో కూడా కీలక మార్పులు రానున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో తీసే వీడియోలు కూడా మరింత క్వాలిటీగా ఉండనున్నాయి . అలాగే, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ వాడి డిజిటల్ కెమెరాలతో తీసినట్లుగా ప్రొఫెషనల్ ఫోటోలు కూడా తీసుకోవచ్చు. ఇది కంటెంట్ క్రియేటర్లకు, ఫోటోగ్రఫీ ప్రేమికులకు గొప్ప వరంగా మారనుంది.

Tags:    

Similar News