Chrome Update: గూగుల్ క్రోమ్ వెంటనే అప్డేట్ చేయండి లేదంటే మీ డేటా గోవిందా..!!

Update: 2021-12-15 09:02 GMT

Chrome Update: గూగుల్ క్రోమ్ వెంటనే అప్డేట్ చేయండి లేదంటే మీ డేటా గోవిందా..!!

Google Chrome Update: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. తాజాగా గూగుల్ క్రోమ్ యూజర్స్ కు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-in) హెచ్చరించింది. క్రోమ్ బ్రౌజర్ లో లోపాలు గుర్తించబడటంతో పాటు వాటి ఆధారంగా హ్యాకర్లు పర్సనల్ కంప్యూటర్లపై దాడి చేసే అవకాశం ఉందని తెలిపింది.

ఆన్లైన్ సైబర్ దాడికి పాల్పడే హ్యాకర్లు మీ కంప్యూటర్ ని రిమోట్ గా హ్యాక్ చేసే అవకాశం ఉందని వెంటనే క్రోమ్ అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు తెలిపాడు. "విండోస్" మరియు "మాక్" కోసం కూడా 96.0.4664.93 కి అప్డేట్ చేయబడిందని ఇది మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుందని అని గూగుల్ తెలిపింది. దీని ద్వారా క్రోమ్ అప్డేట్ లో 22 రకాల సెక్యూరిటీ ఫిక్సేస్ పొందుపరిచినట్లు గూగుల్ తెలిపింది.

గూగుల్ క్రోమ్ ని ఇలా అప్డేట్ చేసుకోండి..

* గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కుడి పై భాగంలో కనిపించే 3 వర్టికల్ డాట్స్ పై క్లిక్ చేయండి.

* అప్పుడు మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. కింది భాగంలో హెల్ప్ అండ్ ఫీడ్ బ్యాక్ అనే బటన్ పై క్లిక్ చేయండి.

* తరువాత అబౌట్ గూగుల్ క్రోమ్ అనే ఆప్షన్ ని ఎంచుకోండి.

* దీంతో క్రోమ్ దానంతట అదే కొత్త వెర్షన్ కు అప్డేట్ అవుతుంది. క్రోమ్ బ్రౌజర్ అప్డేట్ పూర్తయిన తర్వాత మీ సిస్టమ్ ని రీస్టార్ట్ లేదా రీబూట్ చేయండి.

* ఒకవేళ ఈ అప్డేట్ (అబౌట్ గూగుల్ క్రోమ్) ఆప్షన్ లేని యెడల మరికొంత సమయం తరువాత ప్రయత్నించి అప్డేట్ చేసుకోవాల్సిందిగా సూచించారు.  

Tags:    

Similar News