Samsung Galaxy S24 Price Drop: శాంసంగ్ గెలాక్సీ S24.. రూ.37000 ధర తగ్గింపు..!
Samsung Galaxy S24 Price Drop: శాంసంగ్ గెలాక్సీ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయిన S24 5G ఇప్పుడు చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.
Samsung Galaxy S24 Price Drop: శాంసంగ్ గెలాక్సీ S24.. రూ.37000 ధర తగ్గింపు..!
Samsung Galaxy S24: శాంసంగ్ గెలాక్సీ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయిన S24 5G ఇప్పుడు చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. డైరెక్ట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో కలిపి పెద్ద మొత్తంలో సేవింగ్స్ చేసుకోవచ్చు. ఈ డీల్ వల్ల లాంచ్ ధరలో పోలిస్తే దాదాపు సగం ధరకే ఈ ప్రీమియం ఫోన్ దొరుకుతోంది. ప్రీమియం ఫోన్ కొనాలనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం.
ఈ ఫోన్ ఒరిజినల్ MRP ధర రూ. 74,999. కానీ అమెజాన్‌లో ఇప్పుడు రూ. 39,999కి లిస్ట్ అయింది. అంటే నేరుగా 47 శాతం డిస్కౌంట్. దాదాపు రూ. 35,000 ఆదా అవుతుంది. ఇంకా అదనంగా అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లింపు చేస్తే.. 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు. ఇది గరిష్టంగా రూ. 2,000 వరకు ఆదా చేస్తుంది. అన్ని ఆఫర్లు అప్లై చేస్తే ఎఫెక్టివ్ ధర రూ. 37,999కి తగ్గుతుంది. మొత్తం ఆదా దాదాపు రూ. 37,000 అవుతుంది. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌కు ఇంత పెద్ద డీల్ చాలా అరుదుగా వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S24 5Gలో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు తక్కువ ధర వల్ల మిడ్-రేంజ్ ధరలో ప్రీమియం పెర్ఫామెన్స్ దొరుకుతుంది. లాంగ్-టర్మ్ రిలయబిలిటీ కావాలనుకునే వారికి ఇది సరైన ఆప్షన్. శాంసంగ్ ఈ సిరీస్‌కు ఎక్స్‌టెండెడ్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ ఇస్తుంది. సాఫ్ట్‌వేర్ సపోర్ట్ కూడా ఉంది.
డిస్‌ప్లే, డిజైన్ ఫీచర్లు
గెలాక్సీ S24 5G చాలా కాంపాక్ట్, ప్రీమియం డిజైన్‌తో వస్తుంది. 6.2 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్, గేమింగ్, వీడియోలు చాలా స్మూత్‌గా ఉంటాయి. వైబ్రెంట్ కలర్లు, షార్ప్ డీటెయిల్స్ ఇస్తుంది. ఒక చేత్తో సులభంగా ఉపయోగించవచ్చు. ఈ ఫోన్ ఎక్సినోస్ 2400 చిప్‌సెట్ ప్రాసెసర్’తో పనిచేస్తుంది. రోజువారీ పనులు, గేమింగ్ సులభంగా హ్యాండిల్ చేస్తుంది. 4000mAh బ్యాటరీ ఉంది. 25W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. సాధారణ ఉపయోగానికి బ్యాటరీ పర్‌ఫామెన్స్ చక్కగా సరిపోతుంది. IP68 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల కఠిన పరిస్థితుల్లో కూడా సేఫ్‌గా ఉంటుంది.
కెమెరా సెటప్, సెక్యూరిటీ ఫీచర్లు
రియర్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50MP వైడ్-యాంగిల్ ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్, 10MP టెలిఫోటో (3x ఆప్టికల్ జూమ్) ఉన్నాయి. డేలై,ట్ లో-లైట్‌లో షార్ప్ ఫోటోలు, వీడియోలు తీస్తాయి. సెల్ఫీలకు 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో సెక్యూరిటీ మంచిగా ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ S24 5G ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. అమెజాన్ డిస్కౌంట్ వల్ల ఇది మంచి వాల్యూ ఫర్ మనీ డీల్ అవుతోంది. రూ. 40,000 కింద ఫ్లాగ్‌షిప్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ డీల్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ఆఫర్లలో ఇది టాప్‌లో ఉంది.