ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ లకు పోటీగా మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్

Update: 2025-04-16 08:54 GMT

OpenAI CEO Sam Altman: ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ లకు పోటీగా మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్

Sam Altman secretly developing social media platform: చాట్‌జీపీటీతో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ రంగంలో అద్భుతాలు సృష్టిస్తోన్న శామ్ ఆల్ట్‌మన్ మరో కొత్త ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి శామ్ ఆల్ట్‌మన్ కన్ను సోషల్ మీడియాపై పడింది. ఇప్పుడున్న సోషల్ మీడియా టెక్నాలజీకి ఇంకా లేటెస్ట్ టెక్నాలజీని జోడిస్తూ శామ్ ఆల్ట్‌మన్ కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను డిజైన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ (గతంలో ట్విటర్), మార్క్ జుకర్ బర్గ్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను టార్గెట్‌గా చేసుకుంటూ శామ్ ఆల్ట్‌మన్ ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ తీసుకొస్తున్నట్లు ఆ వార్తా కథనాలు చెబుతున్నాయి.

శామ్ ఆల్ట్‌మన్ నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ ప్రొఫెషనల్స్ తయారు చేసిన చాట్ జీపీటీతో పోటీ పడేందుకు మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా కూడా సొంతంగా మెటా ఏఐ తీసుకొచ్చే ఆలోచనలో ఉందని సీఎన్‌బీసీ కథనం పేర్కొంది.

అయితే, ఆ కథనంపై ఆల్ట్‌మన్ స్పందిస్తూ, ఏం పర్వాలేదు. మేం ఒక సోషల్ మీడియా యాప్ తయారు చేస్తాం అని ఫన్నీ రిప్లై ఇచ్చారు. ఒకవేళ ఫేస్ బుక్ ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ లోకి అడుగుపెట్టి తమ వద్దకు రావాలని చూస్తే, తము కూడా అదేవిధంగా రివర్స్ పద్ధతిలో వెళ్లాం అని ఆల్ట్ మన్ చేసిన ప్రకటనను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు.

సీఎన్‌బీసీ, ది వెర్జ్ వంటి మీడియా కథనాల ప్రకారం ప్రస్తుతం ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మేకింగ్ తొలి దశలో ఉంది. అందువల్లే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఇంకా పబ్లిక్‌కు అందుబాటులో లేవు.

ఇప్పటికే గిబ్లి-స్టైల్ ఫోటోల మేకింగ్‌తో చాట్ జీపీటీ ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అప్పటివరకు చాట్ జీపీటీ గురించి తెలియని అతి కొద్దిమందికి కూడా గిబ్లిఫై కారణంగా తెలుసుకునేలా చేసింది. 

గత కొన్నేళ్లుగా ఎలాన్ మస్క్‌కు, శామ్ ఆల్ట్‌మన్‌కు చాట్ జీపిటి విషయంలో విభేదాలు కూడా నడుస్తున్నాయి. ఒకానొక దశలో చాట్ జీపీటీనీ కొంటానంటూ ఎలాన్ మస్క్ ప్రతిపాదన కూడా పెట్టాడు. కానీ అందుకు అసలే ఒప్పుకోని ఆల్ట్‌మన్, నువు అమ్మితే నేనే ఎక్స్ కొంటాను అంటూ మస్క్‌కు రివర్స్ ఆఫర్ ఇచ్చారు. ఇదంతా చూస్తోంటే, ఎలాన్ మస్క్‌ను సోషల్ మీడియా బిజినెస్ పరంగానూ దెబ్బ కొట్టాలనేది శామ్ ఆల్ట్‌మన్ ప్లాన్ అయ్యుండవచ్చనే టాక్ వినిపిస్తోంది.  

Tags:    

Similar News