OnePlus 15R: వన్‌ప్లస్ నుంచి ఖతర్నాక్ ఫోన్.. ఫీచర్లు మామూలుగా లేవుగా..!
OnePlus 15R: వన్‌ప్లస్ తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 15R ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 17న భారతదేశంలోకి వస్తుందని బ్రాండ్ ప్రకటించింది.
OnePlus 15R: వన్‌ప్లస్ నుంచి ఖతర్నాక్ ఫోన్.. ఫీచర్లు మామూలుగా లేవుగా..!
OnePlus 15R: వన్‌ప్లస్ తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 15R ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 17న భారతదేశంలోకి వస్తుందని బ్రాండ్ ప్రకటించింది. లాంచ్‌కు ముందు, కంపెనీ ఫోన్‌ను టీజ్ చేసింది. బ్యాటరీ, డిస్ప్లే, డిజైన్, కెమెరా ఫీచర్లను వెల్లడించింది. ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన 7,400mAh బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీని దీర్ఘకాలిక ఉపయోగం కోసం రూపొందించారు,రోజువారీ ఛార్జింగ్‌తో కూడా నాలుగు సంవత్సరాల తర్వాత కనీసం 80 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇప్పుడు ఈ హ్యాండ్‌సెట్ ఇతర ఫీచర్లు, లీక్ అయిన ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.
వన్‌ప్లస్ 15Rలో 7,400mAh బ్యాటరీ ఉంటుందని కంపెనీ ధృవీకరించింది, ఇది వన్‌ప్లస్ 15 7,300mAh బ్యాటరీ కంటే కొంచెం పెద్దది. కంపెనీ ప్రకారం, ఈ బ్యాటరీ దీర్ఘకాలిక ఉపయోగం కోసం రూపొందించారు. రోజువారీ ఛార్జింగ్‌తో కూడా నాలుగు సంవత్సరాల తర్వాత కనీసం 80 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 80W సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. సిలికాన్ నానోస్టాక్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది, ఇది శక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. యానోడ్‌కు సిలికాన్‌ను జోడించడం ద్వారా బ్యాటరీ జీవితాన్ని పొడిగిస్తుంది. చైనాలోని వన్‌ప్లస్ ఏస్ 6T 8,300mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. గ్లోబల్ వేరియంట్‌లో బ్యాటరీ పరిమాణం తక్కువగా ఉంటుందని నివేదికలు ఇప్పటికే సూచించాయి.
వన్‌ప్లస్ 15Rలో 1,800 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్‌తో 165Hz 1.5K అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. దీనిని డిఫాల్ట్‌గా 2 నిట్స్ వరకు, రెడ్యూయి్ వైట్ పాయింట్ ఫీచర్‌ని ఉపయోగించి 1 నిట్ వరకు ఫేడ్ అవచ్చు. స్క్రీన్ TÜV రీన్‌ల్యాండ్ ఇంటెలిజెంట్ ఐ కేర్ 5.0 సర్టిఫై పొందింది, అంటే ఇది మొబైల్ ఎక్కువగా ఉపయోగించిన కూడా కంటిపై ఒత్తిడి పడకుండా చేస్తుంది. ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 15 కూడా 165Hz వరకు మద్దతు ఇస్తుంది.
వన్‌ప్లస్ 15ఆర్ 120ఎఫ్‌పీఎస్ వద్ద 4K వీడియోను రికార్డ్ చేయగలదని కూడా ధృవీకరించింది, ఇది గతంలో వన్‌ప్లస్ 15 లో మాత్రమే అందుబాటులో ఉండేది. కంపెనీ పూర్తి కెమెరా స్పెసిఫికేషన్‌లను పంచుకోలేదు, కానీ ఫోన్ వన్‌ప్లస్ 13R లో కనిపించే టెలిఫోటో లెన్స్‌ను మినహాయించి డ్యూయల్-కెమెరా సెటప్‌తో వస్తుందని తెలిపింది. ఫోన్‌లలో కనిపించే ప్లస్ మైండ్ ఫీచర్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ప్లస్ కీని ఉపయోగించి, వినియోగదారులు ఆన్-స్క్రీన్ సమాచారాన్ని పొందచ్చు, దీనిని ప్లస్ మైండ్ రిమైండర్‌లు, ఈవెంట్‌లు లేదా సెర్చ్, నోట్స్ క్రియుట్ చేయడానికి ప్రాసెస్ చేయగలదు.