Nothing Phone 4a Pro : నథింగ్ ఫోన్ 4a ప్రో లీక్స్ వచ్చేశాయ్.. రూ.35 వేలకే ప్రీమియం ఫీచర్లు
నథింగ్ ఫోన్ 4a ప్రో లీక్స్ వచ్చేశాయ్.. రూ.35 వేలకే ప్రీమియం ఫీచర్లు
Nothing Phone 4a Pro : టెక్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నథింగ్ బ్రాండ్, ఇప్పుడు మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేసేందుకు సిద్ధమైంది. నథింగ్ ఫోన్ 3 తర్వాత, కంపెనీ తన తదుపరి సంచలనం Nothing Phone 4a Proను తీసుకురాబోతోంది. స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ ఫీచర్లతో రాబోతున్న ఈ ఫోన్ గురించి కొన్ని ఆసక్తికరమైన లీక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రూ.35,000 బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్లు ఇస్తుండటంతో వన్‌ప్లస్, శామ్‌సంగ్ వంటి బ్రాండ్లకు గట్టి పోటీ ఎదురుకానుంది.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నథింగ్ బ్రాండ్ అంటేనే ఒక యూనిక్ స్టైల్. తన ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో అందరినీ ఆకట్టుకున్న ఈ సంస్థ, ఇప్పుడు 4a ప్రో మోడల్‌తో వినియోగదారుల ముందుకు రానుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ పర్ఫార్మెన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ చిప్‌సెట్‌ను అమర్చనున్నారట. ఇది గేమింగ్ ప్రియులకు, మల్టీటాస్కింగ్ చేసేవారికి స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. 12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ ఫోన్ రాబోతుండటం విశేషం. అంతేకాకుండా భవిష్యత్తు అవసరాల కోసం ఇందులో ఈ-సిమ్ (eSIM) సపోర్ట్‌ను కూడా ఇస్తున్నట్లు సమాచారం.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. నథింగ్ ఫోన్ 4a ప్రోలో అదిరిపోయే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండబోతోంది. 64MP ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో), 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో దీనిని రూపొందిస్తున్నారు. దీనివల్ల ప్రొఫెషనల్ క్వాలిటీ ఫోటోలు, స్థిరమైన వీడియోలను సులభంగా తీసుకోవచ్చు. ఇక డిజైన్ పరంగా కంపెనీ తన సిగ్నేచర్ గ్లిఫ్ లైటింగ్ ఎలిమెంట్‌ను కొనసాగించబోతోంది. ఈసారి బ్లూ, పింక్, వైట్ వంటి కొత్త కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ మెరవబోతోంది.
ధర విషయానికొస్తే.. భారతదేశంలో నథింగ్ ఫోన్ 4a ప్రో ప్రారంభ ధర సుమారు రూ.34,999 ఉండవచ్చని అంచనా. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ఈ ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రీమియం లుక్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను తక్కువ ధరకే అందించడం ద్వారా యువతను ఆకట్టుకోవాలని నథింగ్ భావిస్తోంది. త్వరలోనే కంపెనీ నుంచి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.