Google Play Store: గూగుల్ ప్లే‌స్టోర్‌లో ఇకపై ఆ యాప్స్ కనిపించవు..!

Google Play Store: ఏదైనా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి చేసుకోవాలని అందరూ సూచిస్తారు.

Update: 2022-04-08 13:28 GMT

Google Play Store: గూగుల్ ప్లే‌స్టోర్‌లో ఇకపై ఆ యాప్స్ కనిపించవు..! 

Google Play Store: ఏదైనా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి చేసుకోవాలని అందరూ సూచిస్తారు. అయితే అందులో ఉండే యాప్స్ కూడా అంత సురక్షితం కాదని రీసెర్చర్స్ చెబుతున్నారు. అందుకే ఈ మధ్య ఓ డజనుకు పైగా యాప్స్ ను దాని ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. వాటిలో పాపులర్ ముస్లిం ప్రేయర్ యాప్స్ ఉన్నాయని, ఆ యాప్స్ లో ఉండే సీక్రెట్ కోడ్ ద్వారా దాన్ని ఇన్ స్టాల్ చేసుకున్న పర్సన్ ఫోన్ నెంబర్, ఈమెయిల్, చాలా కీలకమైన IMEI కూడా క్యాప్చర్ అవుతున్నట్టు గూగుల్ టెక్ టీమ్ గుర్తించిన తరువాత యాప్స్ ను తొలగించారు.

ముస్లిం ప్రేయర్స్ యాప్స్ ను 7 నుంచి 10 కోట్ల మంది ఇప్పటికే డౌన్ లోడ్ చేసుకున్నారు. వర్జీనియాలో డిఫెన్స్ కు ఉత్పత్తులు అందించే ఓ కంపెనీతో మెజర్ మెంట్ సిస్టమ్స్ అనే సంస్థ ఒక ఒప్పందం కుదుర్చుకుందని, యాప్స్ డెవలపర్స్ కు భారీగా సొమ్ము ముట్టజెప్పి కస్టమర్ల డీటెయిల్స్ ను తస్కరించేలా మాల్ వేర్ తయారు చేయాలని కోరినట్టు తేలింది. దీంతో పలు యాప్స్ లో ఈ మాల్ వేర్ ను జొప్పించినట్లు నిర్ధారించారు. ఇక ఈ అంశం గూగుల్ దృష్టికి 2021లోనే వచ్చినా దాన్ని కన్ఫామ్ చేసుకొని, డిలీట్ చేయడానికి ఇంతకాలం పట్టడం విశేషం. ఈ విషయం స్మార్ట్ ఫోన్ యూజర్లలో ఆందోళన రేపుతోంది. 

Tags:    

Similar News