Elon Musk vs Satya Nadella: ‘మైక్రోసాఫ్ట్‌ను ఓపెన్‌ఏఐ తినేస్తుంది’… మస్క్ వ్యాఖ్యలకు నాదెళ్ల కౌంటర్

ఓపెన్‌ఏఐ తాజాగా తన శక్తివంతమైన ఏఐ మోడల్ చాట్‌జీపీటీ-5ను విడుదల చేసింది. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, ఈ మోడల్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, గిట్‌హబ్ కోపైలట్, Azure AI Foundry వంటి ప్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉందని ప్రకటించారు.

Update: 2025-08-08 14:30 GMT

Elon Musk vs Satya Nadella: ‘మైక్రోసాఫ్ట్‌ను ఓపెన్‌ఏఐ తినేస్తుంది’… మస్క్ వ్యాఖ్యలకు నాదెళ్ల కౌంటర్

ఓపెన్‌ఏఐ తాజాగా తన శక్తివంతమైన ఏఐ మోడల్ చాట్‌జీపీటీ-5ను విడుదల చేసింది. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, ఈ మోడల్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, గిట్‌హబ్ కోపైలట్, Azure AI Foundry వంటి ప్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉందని ప్రకటించారు. ఓపెన్‌ఏఐ నుంచి వచ్చిన అత్యంత పవర్‌ఫుల్ మోడల్ ఇదేనని, విశ్లేషణ, కోడింగ్, చాట్ రంగాల్లో ఇది పెద్ద మార్పులు తీసుకువస్తుందని ఆయన తెలిపారు.

ఈ పోస్ట్‌పై టెస్లా, xAI సీఈఓ ఎలాన్ మస్క్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ఏదో రోజు ఓపెన్‌ఏఐ మైక్రోసాఫ్ట్‌ను తినేస్తుంది” అంటూ ఎక్స్‌లో రాశారు. ఓపెన్‌ఏఐపై గతంలో కూడా విమర్శలు చేసిన మస్క్, మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

దీనిపై సత్య నాదెళ్ల కూడా వెంటనే స్పందించారు. “గత 50 ఏళ్లుగా చాలామంది దీని కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రతిరోజూ కొత్తగా నేర్చుకోవడం, భాగస్వాములు కావడం, పోటీ కొనసాగించడం జరుగుతూనే ఉంది” అంటూ మస్క్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

ఇక ఓ యూజర్ “ఓపెన్‌ఏఐ అడ్వాన్స్‌డ్ ఏఐ మోడల్ విడుదల చేస్తే… ఆ తర్వాత జెమిని, గ్రోక్ వాటిని అందిపుచ్చుకుంటాయి” అంటూ పోస్ట్ చేయగా, మస్క్ “గ్రోక్ 4 ఇప్పటికే పవర్‌ఫుల్ ఏఐ మోడల్” అని బదులిచ్చారు.

Tags:    

Similar News