Airtel : రోజూ 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్..ఎయిర్‌టెల్ కస్టమర్లకు మూణ్నెళ్ల పాటు పండగే పండగ
రోజూ 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్..ఎయిర్‌టెల్ కస్టమర్లకు మూణ్నెళ్ల పాటు పండగే పండగ
Airtel : ఎయిర్‌టెల్ కస్టమరా? ప్రతి నెలా రీఛార్జ్ చేయించుకునే తలనొప్పి లేకుండా, తక్కువ ధరలో ఎక్కువ కాలం వచ్చే ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన రూ.859 ప్లాన్ మీకు పర్ఫెక్ట్ ఛాయిస్. కేవలం ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే చాలు.. దాదాపు మూడు నెలల వరకు మొబైల్ బిల్లు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. రోజూ రూ.10 కంటే తక్కువ ఖర్చుతోనే అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా ఎంజాయ్ చేయవచ్చు.
ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన యూజర్ల కోసం అత్యంత ప్రజాదరణ పొందిన రూ.859 రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా స్టూడెంట్స్, ఆఫీసు పనుల కోసం ఎక్కువగా డేటా వాడేవారు, పదేపదే రీఛార్జ్ చేసే గోల భరించలేము అనుకునే వారికి ఈ ప్లాన్ ఒక వరప్రసాదం. ఈ ప్లాన్ ద్వారా మీకు లభించే వ్యాలిడిటీ ఏకంగా 84 రోజులు, అంటే దాదాపు మూడు నెలల పాటు మీరు నిశ్చింతగా ఉండవచ్చు. రోజువారీ ఖర్చు లెక్కేస్తే ఇది చాలా తక్కువ ధరకే లభిస్తోంది.
ఈ ప్లాన్ ప్రయోజనాల విషయానికి వస్తే.. యూజర్లకు ప్రతిరోజూ 1.5GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. దీనితో మీరు సోషల్ మీడియా బ్రౌజింగ్, వీడియో స్ట్రీమింగ్ లేదా ఆన్‌లైన్ క్లాసులను ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవచ్చు. డేటా పరిమితి దాటిన తర్వాత కూడా ఇంటర్నెట్ వాడుకునే సదుపాయం ఉంటుంది. ఇక కాలింగ్ విషయానికి వస్తే.. లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ అన్నీ పూర్తిగా ఉచితం. అంటే దేశంలో ఎక్కడికైనా ఎన్ని గంటలైనా బేఫికర్‌గా మాట్లాడుకోవచ్చు. దీనితో పాటు రోజూ 100 ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా లభిస్తాయి.
కేవలం డేటా, కాలింగ్ మాత్రమే కాకుండా ఈ ప్లాన్ మరికొన్ని అదనపు ఫీచర్లను కూడా అందిస్తోంది. నేటి కాలంలో విసిగిస్తున్న స్పామ్ కాల్స్ మరియు మెసేజ్‌ల నుంచి రక్షణ కల్పిం స్పామ్ ఫైటింగ్ నెట్‌వర్క్ సదుపాయం ఇందులో ఉంది. అలాగే యూజర్లు తమకు నచ్చిన పాటలను కాలర్ ట్యూన్‌గా పెట్టుకునేందుకు ఫ్రీ హలో ట్యూన్స్ యాక్సెస్ కూడా లభిస్తుంది. ఇంత తక్కువ ధరలో ఇన్ని ప్రయోజనాలు ఇస్తుండటంతో ఎయిర్‌టెల్ కస్టమర్లు ఈ ప్లాన్ వైపు మొగ్గు చూపుతున్నారు. మీ బడ్జెట్‌లో మూడు నెలల పాటు మొబైల్ సేవలు కావాలనుకుంటే వెంటనే ఈ రీఛార్జ్ చేసుకోండి.