WTC final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్.. 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!

WTC final: లార్డ్స్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు చెలరేగిపోతున్నారు. అయితే, ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది.

Update: 2025-06-12 06:15 GMT

WTC final: లార్డ్స్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు చెలరేగిపోతున్నారు. అయితే, ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. రెండు జట్ల ఓపెనర్లు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇది మొదటిసారి. మొత్తం మీద, టెస్ట్ క్రికెట్‌లో ఇలా 10 సార్లు జరిగింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను రబాడ తన బౌలింగ్‌తో వణికించాడు. ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు. మరోవైపు మార్కో యాన్సెన్ మూడు వికెట్లు తీశాడు. దీంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే పరిమితమైంది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా బ్యాటర్లను ఆస్ట్రేలియా బౌలర్లు దెబ్బతీశారు. మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు తీయగా, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ ఒక్కో వికెట్ తీశారు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 43/4 స్కోర్‌తో ఉంది.

అయితే, ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, దక్షిణాఫ్రికా ఓపెనర్ ఐడెన్ మార్క్‌రామ్ ఇద్దరూ మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగారు. 145 ఏళ్లలో టెస్ట్ క్రికెట్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి. రెడ్ బాల్ క్రికెట్‌లో ఇలా ఇప్పటివరకు 10 సార్లు జరిగింది.

మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రబాడ పలు రికార్డులు సృష్టించాడు. దక్షిణాఫ్రికా తరఫున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. రబాడ ఇప్పటివరకు 71 టెస్టుల్లో 332 వికెట్లు తీశాడు. ఇంతకుముందు ఈ రికార్డు అలెన్ డొనాల్డ్ పేరిట ఉండేది. అతను 72 టెస్టుల్లో 330 వికెట్లు తీశాడు.

రబాడ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఇంతకుముందు న్యూజిలాండ్ బౌలర్ కైల్ జెమీసన్ 2021లో భారత్‌పై ఈ ఘనత సాధించాడు. అలాగే, ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్‌లో ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రబాడ నిలిచాడు. ఇంతకుముందు 1998లో జరిగిన ఐసీసీ నాకౌట్ ట్రోఫీ ఫైనల్‌లో జాక్వెస్ కలిస్ 30/5 ప్రదర్శన చేశాడు.

లార్డ్స్ మైదానంలో రబాడ బౌలింగ్ రికార్డు అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు ఇక్కడ మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన రబాడ 18 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికా తరఫున లార్డ్స్‌లో ఎక్కువ వికెట్లు తీసిన రికార్డు ఇంతకుముందు మోర్నీ మోర్కెల్ (15 వికెట్లు) పేరిట ఉండేది. ప్రస్తుతం అతన్ని రబాడ అధిగమించాడు.


Tags:    

Similar News