Tilak Varma: టీమిండియాకు షాక్.. టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు తెలుగోడు దూరం!
Tilak Varma: 2026 టీ20 వరల్డ్‌కప్‌కు ముందు భారత జట్టులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యువ బ్యాటర్ తిలక్ వర్మ, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Tilak Varma: టీమిండియాకు షాక్.. టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు తెలుగోడు దూరం!
Tilak Verma: 2026 టీ20 వరల్డ్‌కప్‌కు ముందు భారత జట్టులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యువ బ్యాటర్ తిలక్ వర్మ, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల గాయపడిన తెలుగు ఆటగాడు తిలక్.. వరల్డ్‌కప్ కోసం ఫిబ్రవరి 3న భారత జట్టుతో చేరనున్నాడు. అయితే అతడు యూఎస్ఏ, నమీబియా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని సమాచారం. పూర్తిగా ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే అతడిని బరిలోకి దించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట. కీలకమైన పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో (ఫిబ్రవరి 15) తిలక్ ఆడే అవకాశాలు ఉన్నాయి.
తిలక్ వర్మ ఎప్పుడు ఆడాలన్న తుది నిర్ణయం మాత్రం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేతుల్లోనే ఉండనుందని తెలుస్తోంది. జట్టు అవసరాలు, మ్యాచ్ పరిస్థితులను బట్టి అతడిని ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తిలక్ ఉన్నాడు. ఫిట్‌నెస్ నిరూపించుకునే పనిలో పడ్డాడు. ఫిట్‌నెస్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత భారత శిబిరంలో చేరనున్నాడు. నిజానికి న్యూజిలాండ్ సిరీస్‌లోనే జట్టులోకి వస్తాడనే వార్తలు వచ్చినా.. అది కుదరలేదు. మ్యాచ్ ఫిట్‌నెస్ సాధిస్తే తిలక్ ఫిబ్రవరి 3న ముంబైలో జట్టుతో కలుస్తాడు.
వాషింగ్టన్ సుందర్ ఇప్పటికీ పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని సమాచారం. ఫిబ్రవరి 4న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అతడు కీలకమైన ఫిట్‌నెస్ టెస్ట్‌కు హాజరవనున్నాడు. ఆ టెస్ట్ ఫలితాల ఆధారంగానే సుందర్ భవిష్యత్తుపై స్పష్టత రానుంది. ఒకవేళ సుందర్ పూర్తిగా ఫిట్ లేకపోతే.. అతడి స్థానంలో ఐపీఎల్ స్టార్ రియాన్ పరాగ్‌ను తీసుకునే ఆలోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రియాన్ పరాగ్ పూర్తిగా ఫిట్‌గా ఉండి సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నాడు. ఒకవేళ అతడికి ఛాన్స్ వస్తే టీ20 వరల్డ్‌కప్ మంచి అవకాశం అని చెప్పొచ్చు.
టీ20 వరల్డ్‌కప్ 2026 సమీపిస్తున్న వేళ ఈ ఫిట్‌నెస్ అప్‌డేట్స్ భారత జట్టు వ్యూహాలను మార్చే అవకాశం ఉంది. తిలక్ వర్మ ఎప్పుడు బరిలోకి దిగుతాడు?, వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాస్ అవుతాడా? లేక రియాన్ పరాగ్‌కు అవకాశం దక్కుతుందా? అన్నది రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది. తెలుగు అభిమానులు ఎప్పటికప్పుడు తిలక్ అప్‌డేట్స్‌పై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచే భారత్, శ్రీలంక వేదికగా వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. టోర్నీ మొదటి రోజే ముంబైలో అమెరికాతో టీమిండియా తలపడనుంది.