BCCI: అగార్కర్, సూర్యకుమార్‌లను కాపాడిన బీసీసీఐ.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏం జరిగిందంటే ?

BCCI: ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆసియా కప్ 2025 కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించారు.

Update: 2025-08-20 07:27 GMT

BCCI: అగార్కర్, సూర్యకుమార్‌లను కాపాడిన బీసీసీఐ.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏం జరిగిందంటే ?

BCCI: ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆసియా కప్ 2025 కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు బీసీసీఐ మీడియా మేనేజర్ మధ్యలో కల్పించుకుని ఒక సున్నితమైన అంశంపై అడిగిన ప్రశ్నను వెంటనే ఆపేశారు.

ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యూఏఈలో జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. సెప్టెంబర్ 14న రెండు జట్లు దుబాయ్‌లో తలపడనున్నాయి. ఫలితాలను బట్టి సూపర్-4, ఫైనల్‌లో కూడా ఇవి మరోసారి తలపడే అవకాశం ఉంది. ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించిన తర్వాత ఈ మ్యాచ్ మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్‌ లో భాగంగా సైనిక చర్యను ప్రారంభించింది. దీంతో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌పై ప్రజలు, మాజీ క్రికెటర్లలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో ఒక జర్నలిస్ట్ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించి ప్రశ్న అడిగారు. అప్పుడు బీసీసీఐ మీడియా మేనేజర్ వెంటనే కల్పించుకుని అజిత్ అగార్కర్‌ను సమాధానం చెప్పకుండా ఆపేశారు. రిపోర్టర్ ఈ ఆసియా కప్‌ను చూస్తుంటే సెప్టెంబర్ 14న ఒక పెద్ద మ్యాచ్ ఉంది, భారత్ వర్సెస్ పాకిస్థాన్. గత రెండు నెలల్లో రెండు దేశాల మధ్య జరిగిన పరిస్థితులను చూస్తుంటే మీరు ఆ మ్యాచ్‌ను ఎలా చూస్తారు? అని అడిగాడు. ఆ సమయంలో మీడియా మేనేజర్ మధ్యలో వచ్చి, ప్రశ్నను ఆపేశారు. ఒక్క నిమిషం ఆగండి. టీం సెలక్షన్ గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే, అడగండి అని చెప్పారు.

ఇప్పటికే మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్ భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను బహిష్కరించాలని సలహా ఇచ్చారు. హర్భజన్ సింగ్ ఇటీవలే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లో భారత్ తరఫున ఆడాడు. అతను పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడటానికి నిరాకరించాడు. అలాగే, కేదార్ జాదవ్ కూడా భారత్ ఈ మ్యాచ్ ఆడకూడదని అన్నారు.

Tags:    

Similar News