Vaibhav Sooryavanshi: వచ్చే 20 ఏళ్లు వైభవ్ సూర్యవంశీవే.. బెన్ స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు!
భారత క్రికెట్ భవిష్యత్తుపై ప్రపంచం దృష్టి సారించేలా చేసిన ఇన్నింగ్స్ ఇది. అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లాంటి అతిపెద్ద వేదికపై కేవలం 14 ఏళ్ల వయసులోనే సంచలనం సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ.
Vaibhav Sooryavanshi: వచ్చే 20 ఏళ్లు వైభవ్ సూర్యవంశీవే.. బెన్ స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు!
భారత క్రికెట్ భవిష్యత్తుపై ప్రపంచం దృష్టి సారించేలా చేసిన ఇన్నింగ్స్ ఇది. అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లాంటి అతిపెద్ద వేదికపై కేవలం 14 ఏళ్ల వయసులోనే సంచలనం సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. శుక్రవారం హరారేలో ఇంగ్లాండ్‌తో జరిగిన 2026 వరల్డ్‌కప్ ఫైనల్‌లో 55 బంతుల్లోనే సెంచరీ బాదాడు. మొత్తంగా 80 బంతుల్లో 15 సిక్సులు, 15 ఫోర్లతో ఏకంగా 175 పరుగులు చేశాడు. ఫైనల్లో అతడి స్ట్రైక్‌రేట్ 218.75గా ఉండడం విశేషం. వరుస బౌండరీలతో ఇంగ్లాండ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యవంశీపై ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచమంతా హాట్ టాపిక్‌గా మారాయి.
వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌ను బెన్ స్టోక్స్ అసాధారణంగా వర్ణించాడు. 'వరల్డ్‌కప్ ఫైనల్ లాంటి వేదికపై 14 ఏళ్ల వయసులో ఇలాంటి తుఫాను ఇనింగ్స్ అంటే నమ్మబుద్ది కావడం లేదు. ఇది ఓ మనిషి చేయగలిగింది కాదు. ఇది సూపర్‌న్యాచురల్ పవర్. ఇది కేవలం ఒక ఇన్నింగ్స్ కాదు. భారత క్రికెట్ భవిష్యత్తుకు బాటలు' అంటూ 'ప్రశంసించాడు. 'వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరు వచ్చే 20 ఏళ్ల పాటు ప్రపంచ క్రికెట్‌ను పాలించబోతోంది' స్టోక్స్ చెప్పుకొచ్చాడు. ఒక అంతర్జాతీయ స్టార్ నుంచి వచ్చిన ఈ స్థాయి ప్రశంసలు.. వైభవ్‌పై ఎన్ని అంచనాలు ఉన్నాయో ఇట్టే అర్ధమవుతోంది.
ఫైనల్ ఒత్తిడిలోనూ వైభవ్ సూర్యవంశీ చూపిన ధైర్యం, షాట్ సెలెక్షన్, పవర్ హిట్టింగ్ క్రికెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. పెద్ద అనుభవం ఉన్న బ్యాటర్ మాదిరి ఆటను అర్థచేసుకోవడం, బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడం.. ఇవి అన్నీ అతని వయసుకు మించిన పరిపక్వతను చాటాయి. ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ పేరు ప్రపంచ క్రికెట్ మ్యాప్‌పై గట్టిగా ముద్రపడింది. మొత్తంగా చూస్తే.. వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ భారత యువ క్రికెట్‌కు కొత్త దిశ చూపించింది. ప్రతిభ, ధైర్యం, వేదిక.. మూడింటినీ జయించిన ఈ ప్రదర్శనతో అతడు భవిష్యత్తు స్టార్‌గా కాదు, ఇప్పుడే స్టార్‌గా నిలిచాడు.