India vs South Africa 2nd Test: బావుమా మాస్టర్‌మైండ్.. భారత్‌కు ఫాలో-ఆన్ ఎందుకు ఇవ్వలేదు?
గౌహతిలో జరుగుతున్న భారత్, సౌతాఫ్రికా మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు భారీగా 489 పరుగులు చేయగా, టీమిండియా కేవలం 201 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
India vs South Africa 2nd Test: బావుమా మాస్టర్‌మైండ్.. భారత్‌కు ఫాలో-ఆన్ ఎందుకు ఇవ్వలేదు?
India vs South Africa 2nd Test: గౌహతిలో జరుగుతున్న భారత్, సౌతాఫ్రికా మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు భారీగా 489 పరుగులు చేయగా, టీమిండియా కేవలం 201 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 288 పరుగుల భారీ లోటుతో నిలిచింది. సాధారణంగా టెస్ట్ క్రికెట్‌లో 200 పరుగుల లోటు ఉన్నప్పుడు ప్రత్యర్థి జట్టుకు ఫాలో-ఆన్ ఇస్తారు. అయితే సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ఆ అవకాశం ఉన్నా, భారత్‌కు ఫాలో-ఆన్ ఇవ్వకుండా, తామే మళ్లీ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీని వెనుక బవుమా ఒక పక్కా వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
టెంబా బవుమా ఫాలో-ఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్‌లో తామే బ్యాటింగ్‌కు రావడానికి ప్రధాన కారణం సిరీస్‌ను గెలవడమే. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే సౌతాఫ్రికా మొదటి మ్యాచ్ గెలిచి 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఈ రెండో టెస్ట్‌లో కనీసం డ్రా చేసుకున్నా కూడా సిరీస్ విజయం దక్షిణాఫ్రికాదే అవుతుంది. ఈ లక్ష్యంతోనే బవుమా రెండోసారి బ్యాటింగ్‌కు దిగాడు. వారి ప్లాన్ ఏమిటంటే నాలుగో రోజు ఆట మూడో సెషన్ వరకు బ్యాటింగ్ కొనసాగించి, కనీసం 250 పరుగులు చేస్తే మొత్తం స్కోరు 538 పరుగులకు చేరుతుంది.
దక్షిణాఫ్రికా ఈ వ్యూహాన్ని అమలు చేస్తే, టీమిండియా ముందు చివరి ఇన్నింగ్స్‌లో సుమారు 539 పరుగుల అసాధ్యమైన లక్ష్యం ఉంటుంది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడం దాదాపు అసాధ్యమే. అప్పుడు టీమిండియా ముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉంటాయి.పరుగుల కోసం ప్రయత్నించకుండా మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం, లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో తొందరగా ఆలౌట్ అవ్వడం.
మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 201 పరుగులకే ఆలౌట్ అయిన భారత్, మళ్లీ ఇంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తే, ఆలౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అలా జరిగితే దక్షిణాఫ్రికా 2-0 తేడాతో సిరీస్ గెలుస్తుంది. ఒకవేళ భారత్ డ్రా చేసుకుంటే, దక్షిణాఫ్రికా 1-0 తేడాతో సిరీస్ గెలుస్తుంది. ఈ లెక్కలన్నీ వేసుకునే టెంబా బవుమా ఫాలో-ఆన్ ఇవ్వకుండా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు.
288 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా జట్టు, మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు మొత్తం ఆధిక్యం 314 పరుగులకు చేరుకుంది. నాలుగో రోజు ఆటలో దక్షిణాఫ్రికా ఎంత వేగంగా పరుగులు చేసి, ఎప్పుడు డిక్లేర్ చేస్తుందో చూడాలి.