Asia Cup 2025 : ఉత్కంఠకు తెర.. నేడే ఆసియా కప్ జట్టు ప్రకటన
Asia Cup 2025 : ఉత్కంఠకు తెర.. నేడే ఆసియా కప్ జట్టు ప్రకటన
Asia Cup 2025 : ఉత్కంఠకు తెర.. నేడే ఆసియా కప్ జట్టు ప్రకటన
Asia Cup 2025 : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025కు సంబంధించిన జట్టును ఈరోజు అధికారికంగా ప్రకటించనున్నారు. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మంగళవారం మధ్యాహ్నం ముంబైలో సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి టీమిండియా స్క్వాడ్‌ను వెల్లడించనున్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత కెప్టెన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి ఈ ప్రకటన ఉంటుంది.
ఆసియా కప్ 2025కు భారత్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ, టోర్నమెంట్ మ్యాచ్‌లు మాత్రం సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో జరుగుతాయి. ఈసారి టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. మొత్తం ఎనిమిది దేశాల జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటాయి. ప్రస్తుత ఛాంపియన్‌గా ఉన్న టీమిండియాపై ఈసారి కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. 2023లో జరిగిన గత ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ శ్రీలంకను 10 వికెట్ల తేడాతో ఓడించి కప్ గెలుచుకుంది.
ఇటీవల భారత క్రికెట్ జట్టు వివిధ ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లతో ఆడుతోంది. టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఉండగా, టెస్ట్ జట్టుకు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. గిల్ సారథ్యంలో ఇటీవల ఇంగ్లాండ్‌పై టీమిండియా అద్భుతంగా రాణించింది. అందుకే, టీ20 జట్టులో కూడా గిల్‌కు చోటు దక్కవచ్చని భావిస్తున్నారు. ఈరోజు ఈ విషయంపై స్పష్టత రానుంది.
అలాగే, జట్టు ఎంపికలో సీనియర్ ఆటగాళ్ల ఫిట్‌నెస్, యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించడం మధ్య సమతుల్యత సాధించడం సెలెక్షన్ కమిటీకి సవాలుగా మారింది. ఏ ఆటగాళ్లకు చోటు దక్కుతుందో, ఎవరిని పక్కన పెడతారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లైవ్ ఎక్కడ చూడాలి?
అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అలాగే, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో జియోహాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు.
మహిళల జట్టు కూడా..
ఈరోజు కేవలం పురుషుల జట్టు మాత్రమే కాకుండా, మహిళల జట్టును కూడా ప్రకటించనున్నారు. మహిళల జట్టు ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ ఆడనుంది. ఈ జట్టునే రాబోయే మహిళల వన్డే ప్రపంచ కప్‌కు కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది.